నవతరం

తెలుగు దినపత్రిక

ఫిజియోథెరపీ సేవలు సద్వినియోగం చేసుకోండి

ములకలపల్లి, నమస్తే ఎల్లంపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండల కేంద్రంలోప్రతి బుధవారం స్థానిక భవిత కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న ఫిజియోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని భవిత కేంద్రం నిర్వాహకురాలు కనక దుర్గ విజ్ఞప్తి చేశారు. ఫిజియోథెరఫిస్ట్ జ్యోతి పాల్వంచ భవిత కేంద్రంలో సేవలు అందిస్తున్న సందర్భంగా పిల్లలకు వారి తల్లదండ్రులకు పలు సూచనలు ఇచ్చారు. ఫిజియోథెరపీ సేవలు ప్రైవేట్ వైద్యశాలల్లో పొందాలంటే ఖర్చుతో కూడుకుందని కానీ ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. మండల పరిధిలో దివ్యాంగులైన పిల్లలను గుర్తిస్తున్నామని తల్లిదండ్రులు కూడా సహకరించాలని భవిత నిర్వాహకులు కోరారు. ఈ కార్య్రమంలో ఫైజియోదెరఫిస్ట్ జ్యోతి భవిత నిర్వాహకులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading