- సర్వే నెంబర్ 79 లో ప్రభుత్వ భూమి మాయం
కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని గాజులరామారం డివిజన్ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 79 మెట్టుఖాన్ గూడ లో గల ప్రభుత్వ భూములకు రక్షణ కరువైందని చెప్పుకోవచ్చు , ప్రభుత్వ పాఠశాల వెనక వున్న ప్రభుత్వ భూములు మాయం చేసే పనిలో నిమగ్నమయ్యారు కొందరు కబ్జాదారులు.మెట్టుఖాన్ గూడ లో ఈ భూములపై కొందరు అక్రమార్కుల కన్ను పడింది. దీంతో గత కొన్ని సంవత్సరాల నుండి ఎలాగోలా ఈ భూములను కబళించివేయాలనే పన్నాగం పన్నారు. దాంతో ఏం చేయాలో తెలియక గమ్మున ఉన్న వీరికి కొందరు అవినీతి అధికారులు తోడు కావటంతో గత సంవత్సర కాలం నుండి రెచ్చిపోయిన ఈ కబ్జాదారులు ఎన్నో ప్లాట్ లు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ కబ్జా భాగోతంలో ఎవరెవరున్నారు. ఎంత మేర ప్రభుత్వ భూమిని మాయం చేశారు. క్కుతు్బుల్లాపూర్ తాసిల్దార్ ఈ భూమిని సందర్శించారా లేదా అనేది ప్రశాంతంగా మారిందని చెప్పుకోవచ్చు రెవిన్యూ అధికారులకు మేనేజ్ చెయ్యని వారి కబ్జా రూములను, బెస్మెట్లు ను రాత్రికి రాత్రే కూల్చివేతలు చేస్తారనే మాట అందరికీ తెలిసిందే కొంతమంది రాజకీయ నాయకులు అండదండలతో గత సంవత్సరం నుండి కబ్జాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవడంలో రెవెన్యూ అధికారులు మర్చిపోయారా అనే విమర్శలు వెలువడుతున్నాయి.


కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్ ఈ కబ్జాలపై ఏం చెర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని గాజులరామారం సర్వే నెంబర్ 79 మెట్టుఖాన్ గూడ లో ఉన్న ప్రభుత్వ భూములకి రక్షణ కరువైందని చెప్పుకోవచ్చు , ప్రభుత్వ పాఠశాల వెనక వున్న ప్రభుత్వ భూములు మాయం చేసే పనిలో నిమగ్నమయ్యారు కొందరు కబ్జాదారులు.ఈ భూములపై కొందరు అక్రమార్కుల కన్ను పడింది. దీంతో గత కొన్ని సంవత్సరాల నుండి ఎలాగోలా ఈ భూములను కబళించివేయాలనే పన్నాగం పన్నారు. దాంతో ఏం చేయాలో తెలియక గమ్మున ఉన్న వీరికి కొందరు అవినీతి అధికారులు తోడు కావటంతో గత సంవత్సర కాలం నుండి రెచ్చిపోయిన ఈ కబ్జాదారులు ఎన్నో ప్లాట్ లు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ కబ్జా భాగోతంలో ఎవరెవరున్నారు. ఎంత మేర ప్రభుత్వ భూమిని మాయం చేశారు. జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసిల్దార్ ఈ భూమిని సందర్శించారా…? లేదా…?? అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఈ కబ్జా భూమిపై ‘ప్రత్యేక కథనం’ మీ ముందుకు…

ఈ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. గతంలోనే కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడి ప్రభుత్వ భూములపై కన్నేసిన ఓ కబ్జా ముఠా ప్రస్తుతం కొన్ని రూములో, బేస్మెంట్ లు అక్రమ నిర్మాణాలు చేసి తమ సత్తా చాటుకుంది. ఇదంతా కూడా స్థానిక రెవెన్యూ అధికారులకు తెలియదా అంటే.. అంతా తెలుసంటున్నారు స్థానిక ప్రజలు. కబ్జాదారుల చేతిలో పావులుగా మారిన రెవెన్యూ అధికారులు నామమాత్రపు కూల్చివేతలు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు దండిగానే వున్నాయి. సామాన్య ప్రజలకు ఒక చట్టం, డబ్బులున్నవాడికో చట్టమా అంటూ మండిపడుతున్నారు ఇక్కడి జనం. కటిక పేదవాడు ప్రభుత్వ భూమిలో ఓ గుడిసె వేసుకుంటే సహించని రెవెన్యూ అధికారులు పట్టపగలు, అర్ధరాత్రిళ్ళు అనే తేడా లేకుండా రెవెన్యూ అధికారులను, జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం సవాలు చేస్తూ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా ఏమీ తెలియనట్లు నటిస్తున్న క్కుతు్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులపై అధికార పార్టీ నాయకుల పై పలు అనుమానాలు తావిస్తున్నాయి. అదే కాకుండా అక్కడ వెలుస్తున్న నిర్మాణాలను చూసి అటువైపు ఎవరైనా వెళ్లాలని ప్రయత్నిస్తే.. అక్కడ ఉన్న కొందరు ప్రైవేట్ గూండాలు ‘మీరెవెరు, మీకేం కావాలి అని ఆరా తీస్తారు. వారికి అనుకూలంగా ఉండి సమాధానం చెప్తారు లేదంటే బెదిరిస్తారు. నోటరీ పేపర్లు రాసి ఇస్తాము’ అంటూ అప్పటికే నిర్మించి ఉంచిన కొన్ని నిర్మాణాలను చూపిస్తారు. దీంతో సొంత ఇంటి కల వున్న మధ్యతరగతి ప్రజలు ఎంతోమంది వీరి ఉచ్చులో చిక్కుకుని మోసపోయారు. ఇక్కడి ప్లాట్ లను అమ్మడం ఒక వంతయితే.. అవే ప్లాట్ లను వేరేవారికి ఎక్కువ రేటుకు అమ్మి లక్షలు దండుకుంటారు.

స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి ఇక్కడి ప్రభుత్వ భూములపై కన్నేసి, వాటిని ప్లాట్ లుగా విభజించి మొదటగా ఒక్కో ప్లాట్ ను లక్ష, రెండు లక్షల రూపాయలు అమ్ముకుంటారు. అవి ఉంటాయో, పోతాయో తెలియక ప్లాట్ లను కొనుక్కున్న అమాయకులు అందులో చిన్న చిన్న ఇండ్లను ఏర్పాటు చేసుకుని స్వంత ఇంటి కల నెరవేరిందనుకుంటారు. ఇంతలోనే రెవెన్యూ అధికారులు వచ్చి మీరు ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇండ్లను నిర్మించారు. వీటికి కూల్చేస్తామని చెప్తారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లూపే అంతా అయిపోతుంది. దీంతో ఏం చేయాలో తూచక లబొదిబోమంటూ స్థానిక ప్రజా ప్రతినిధుల వద్దకు పరుగులు తీస్తారు. వారు కూడా ఏం చేయాలో తెలియక అధికారులకు ఫోన్లు చేసి కరెంటు మీటర్లు వచ్చిన ఇండ్లను కూల్చకండంటూ ఆదేశాలు జారీ చేస్తారు. దీంతో ఇక్కడి ప్రభుత్వ భూముల్లో ఒకటో రెండో ఇండ్లు నిలబడతాయి. కూల్చివేతల సమయంలో అక్కడ నుండి జారుకున్న కబ్జాదారులు మళ్ళీ అక్కడ ప్రత్యక్షమవుతారు. అంతే.. అమ్మకాలు మళ్ళీ మొదలవుతాయి. ఇప్పుడు మాత్రం లక్షా, రెండు లక్షలు కాకుండా అయిదు, ఆరు లక్షలకు ఒక ప్లాట్ అంటూ కొంత రేటు పెంచి ప్లాట్ లు అమ్ముకుంటారు. మళ్ళీ అదే తంతు కొనసాగుతుంది. ఇప్పుడు రెవెన్యూ అధికారులు ఒకడుగు ముందుకేసి వారివద్ద నుండి కొన్ని నోటరీ పత్రాలు సంపాదించి కొన్ని కేసులు నమోదు చేస్తారు. వీధి నిర్వహణలో భాగంగా కొద్ది భాగమూ, సగ భాగమో కొన్ని నిర్మాణాల కూల్చివేతలు చేస్తారు.

ఇప్పటివరకు కేసులంటే భయపడిన కబ్జాదారులు కొందరు దళారులను ఆసరాగా చేసుకుని కొందరు అవినీతి అధికారులకు ఆశ చూపించి, మీకు కొన్ని ప్లాట్ లు ఇస్తాము, కొంత సైడ్ అమౌంట్ ఇస్తాము అంటూ ఆశ చూపిస్తారు. ఆశ కు రుచి మరిగిన అవినీతి అధికారులు వారి కబ్జాలను చూసీ చూడనట్టు పోతారు. వారి ఆఫర్ లను తిప్పికొట్టే అధికారులు తమ విదులు తాము నిర్వహిస్తారు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఇక్కడి కబ్జాదారుల్లోనూ తెలివి పెరుగుతుంది. దీంతో ఎవరితో చెప్పించుకుంటే పనవుతుందో ఆలోచిస్తారు. అంతే.. దాని ఫలితమే ఇక్కడి అక్రమ నిర్మాణాలంటున్నారు స్థానిక ప్రజలు. ఈ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే సంబంధిత అధికారులు కొన్నింటికి నోటీసులు మాత్రమే చేస్తారు, ఆ నోటీసులు ఫైల్ చేసి ఉన్నతాధికారులకు పంపుతారు. దానితో ఈ కబ్జాదారులు బాగోతం ప్రశాంతం అవుతుంది గతంలో ఈ సర్వేనెంబర్ 79 ప్రభుత్వ భూమిలో ఓ ప్రభుత్వ సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. కాని దానిపక్కనే కబ్జా వీరికి కబ్జాలను సజావుగా సాగిస్తున్నారు.
తెరవనుకున్న కబ్జాదారుడు ఎవరు?
ఈ అక్రమ కట్టడాలలో తెర వెనక ఉండి నడిపిస్తున్న ఆ కబ్జాదారుడు ఎవరాని పలు అనుమానాలు తాగిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు సైతం ఈ రూములు పట్టపగలే కడుతున్న వాటిని వదిలేయడం వారిపై చర్యలు తీసుకోపోవడంలో అధికారుల పాత్ర ఎంతుందో అని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒకవైపు ప్రభుత్వ భూమిని కాపాడాలని ప్రభుత్వ పై స్థాయి అధికారులు పలుమార్లు సమావేశాలు పెట్టి చెప్పినప్పటికీ ఈ కబ్జాలు మాత్రం ఆగటం లేదనేది వాస్తవం.
ప్రభుత్వ భూములు కాపాడండి
కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని గుర్తించి, ఆ భూములను భవిష్యత్ తరాలకు ఉపయోగ పడేలా కాపాడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కబ్జాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్టులు నమోదు చేసి మళ్ళీ ఎవరూ కూడా ప్రభుత్వ భూముల జోలికి రాకుండా లాండ్ ప్రొటెక్షన్ కమిటీ సైతం చర్యలు తీసుకోవాలని కొందరు సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.





































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.