నవతరం

తెలుగు దినపత్రిక

అమ్మవారికి ప్రత్యేక పూజలు

పోచమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు

సత్యం శ్రీరంగం

కూకట్ పల్లి, నమస్తే ఎల్లంపల్లి: కూకట్ పల్లి నియోజక వర్గం ఫతేనగర్ గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయంలో బొడ్రాయి ప్రతిష్టించిన మొదటి వార్షికోత్సవం సందర్బంగా టీపీసీసీ సభ్యులు డా. సత్యం శ్రీరంగం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహముతో ప్రజలంతా సుఖ, సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని, ముల్లోకాలను ఏలే ఆ జగన్మాత కరుణ కటాక్షాలు ఎల్లపుడు అందరిపై ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫతే నగర్ స్టీల్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస మూర్తి, త్రిలోక్ అగర్వాల్, అనిల్ గోయల్, ఇందర్, ఫతేనగర్ డివిజన్ అధ్యక్షులు కుక్కల రమేష్, తూము వేణు, దేవాలయ కమిటీ ప్రతినిధులు కంచి మహేందర్, సూరజ్ తివారి, కుక్కల రాజు, రాజు ముదిరాజ్, కృష్ణ చైతన్య, రమేష్ బాబు, వరాహ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading