భద్రాచలం, నమస్తే ఎల్లంపల్లి: భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటు నందు గల త్రివేణి పాఠశాల నందు ఈరోజు ముందస్తు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు, పిల్లలకు జీసస్, మేరీ మాత, క్రిస్మస్ తాత శాంటా, వేషధారణలు వేయించినారు పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా యొక్క వేడుకలను జరుపుకున్నారు, స్కూల్ ప్రిన్సిపల్ జంగాల మంజుల మాట్లాడుతూ ఏసుక్రీస్తు జననం గురించి పశువుల పాకలో జన్మించినటువంటి ఏసుక్రీస్తును గొర్రెల కాపరులు చూచుట ఏసుక్రీస్తు జన్మదినం ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను సోదరీ సోదరీమణులు ఏ విధంగా జరుపుకుంటారు ప్రేమకు త్యాగానికి మారుపేరే జీసస్ జన్మదినమని తెలియ చెప్పినారు, ఈ యొక్క కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కానుమిల్లి విమలాదేవి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బాబురావు, అకడమిక్ ఇంచార్జ్ నరేష్, క్యాంపస్ ఇంచార్జ్ సందీప్ రెడ్డి, ఇతర బోధన సిబ్బంది పిల్లలు తదితరులు పాల్గొన్నారు.
























































































You must be logged in to post a comment.