కూకట్ పల్లి, నమస్తే ఎల్లంపల్లి: వివేకానంద నగర్ లోని నారాయణ స్కూల్ లో గురువారం సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. సంక్రాంతి పండుగకు ముందే పాఠశాల విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు. సంక్రాంతి ముగ్గులతో డూడూ బసవన్నలు, హరిదాసులు, ముత్యాలముగ్గులు, పతంగులు, భోగిమంటలు, కోడి పుంజులు ఇలా సంక్రాంతిని కళ్ళ ముందుకు తెచ్చే అనేక కార్యక్రమాలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులు చిన్న పిల్లలకు భోగి పండ్లు పోసారు. పాఠశాల ప్రాంగణమంతా పల్లెటూరిని తలపించింది. సంక్రాంతి నేపథ్య వేషాధారణలో విద్యార్థులు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ శరణి, ప్రత్యూష రెడ్డి డీన్, వేణుగోపాల్ ఏజిఏం, ప్రిన్సిపాల్ శ్వేత, శ్రీవల్లి, అబేద, కోఆర్డినేటర్ సోనియా, సాఫ్ట్ స్కిల్స్ హెడ్ వేద, వైస్ ప్రిన్సిపల్ సౌమ్య తదితరులు పాల్గొన్నారు.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.