* సూరారం రామాలయాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీలో గల రామాలయాన్ని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పక్కనే నిర్మిస్తున్న శివాలయం పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఆలయాల అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.