* ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు ఆకట్టుకున్న రంగవల్లులు
మేడ్చల్ జిల్లా, నమస్తే ఎల్లంపల్లి: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 24వ డివిజన్లో కార్పొరేటర్ యంపల్ల అనంతరెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా డివిజన్లో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మేయర్ జక్కా వెంకట్ రెడ్డి పాల్గొని ముగ్గులు వేసిన మహిళలను, మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన కార్పొరేటర్ యంపల్ల అనంతరెడ్డిని అభినందించారు.అనంతరం పోటీలలో గెలుపొందిన మహిళలకు మేయర్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ యంపల్ల అనంతరెడ్డి మాట్లాడుతూ అధిక సంఖ్యలో అత్యంత ఉత్సాహంగా పోటీలలో పాల్గొన్న మహిళలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఈ కార్యక్రమం నిర్వహించిన విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో 24వ డివిజన్ అభివృద్ధిలో దూసుకుపోతుందని, గడిచిన మూడు సంవత్సరాలలో డివిజన్లోని ప్రతి కాలనీలో సీసీ రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీటి సమస్యలు లేకుండా కృషి చేశామని రాబోయే రెండు సంవత్సరాలలో మేయర్ జక్క వెంకట్రెడ్డి సహకారంతో డివిజన్ ప్రజల సపోర్టుతో మరింత అభివృద్ధి చేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని కార్పొరేటర్ అన్నారు.ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోవాలని ఉద్దేశంతో మహిళల కోసం ముగ్గుల పోటీలు నిర్వహించామని, పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఆలోచింపజేసే విధంగా అద్భుతమైన ముగ్గులను వేశారని, పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతిని అందించామని, 24వ డివిజన్లో గల ప్రతి కాలనీకి మేయర్ చేతుల మీదుగా ప్రథమ ద్వితీయ బహుమతులు అందించామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మహిళలకు తమ అత్యుత్తమ సందేశాన్ని అందించి బహుమతులు అందజేసిన మీ జక్క వెంకట్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఓం విహార్ కాలనీ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి ,జనరల్ సెక్రెటరీ సంగారెడ్డి, మారుతి నగర్ ప్రెసిడెంట్ శ్రీనివాస్,జనరల్ సెక్రటరీ బొక్క చంద్రశేఖర్ రెడ్డి,సాయి నగర్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి,
జనరల్ సెక్రెటరీ మధు,ప్రశాంత్ నగర్ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి,జనరల్ సెక్రెటరీ ఎస్ కుమార్, డివిజన్ ప్రెసిడెంట్ గుర్రం మల్లారెడ్డి,జనర సెక్రటరీ కవ్వం లక్ష్మారెడ్డి, డివిజన్ మహిళా ప్రెసిడెంట్ ఝాన్సీ, జనరల్ సెక్రెటరీ మానస, ఇందిర లత, కాలనీ వాసులు, కమిటీ సభ్యులు,డివిజన్ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ముగ్గుల పోటీల విజేతలు
ప్రశాంత్ నగర్: మొదటి బహుమతి రజిత,
ద్వితీయ బహుమతి సునీత
ఓం విహార్ కాలనీ:ప్రథమ బహుమతి సుప్రియ,
ద్వితీయ బహుమతి యశోద,సుధారాణి
సాయి నగర్ కాలనీ: ప్రథమ బహుమతి Ch.కల్పన,ద్వితీయ బహుమతి వర్ష శ్రీ,
మారుతీ నగర్:ప్రధమ బహుమతి ప్రభాలత
ద్వితీయ బహుమతి సుజాత






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.