నవతరం

తెలుగు దినపత్రిక

అన్నదాన సత్రంలో భక్తుల భోజనాన్ని మెరుగుపరచాలి

* శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అన్నదాన సత్రంలో భక్తుల భోజనాన్ని మెరుగుపరచాలి

శ్రీశైలం, నమస్తే ఎల్లంపల్లి: శ్రీశైలం దేవస్థానంలో భక్తులకు నిత్య అన్నదానంలో భోజనాన్ని మెరుగుపరచాలని కొమరం భీం చెంచు గిరిజన సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు వై. ఆశీర్వాదం, చెంచు గిరిజన నాయకుడు కుడుముల వెంకటేశ్వర్లు సోమవారం అన్నారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదాన సత్రంలో భోజన సదుపాయాన్ని దేవస్థానం వారు కల్పిస్తున్నారు. పప్పు, సాంబారు నాసిరకం కూరగాయలతో చేస్తున్నారన్నారు. కనీసం శుభ్రపరచకుండా భోజనాలు వండుతున్నారని ఆరోపించారు. దేవస్థానంలో ఉన్నటువంటి కొంతమంది అధికారుల చేతివాటంతో భక్తులకు చెందాల్సిన ఆహారాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భారీగా అధికారులు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఎండోమెంట్ ఉన్నత అధికారులు స్పందించి శ్రీశైలం దేవస్థానంలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేపట్టాలన్నారు. వంటశాలలో భోజనం ఎలా తయారు చేస్తున్నారో తనిఖీలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వై శీను, పి. మల్లికార్జున, గోపాల్ నాయక్, శ్రీను, మల్లేష్ , వెంకటేశ్వర్లు, గంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading