* సంక్రాంతి సంబురాలలో ముస్లిం సోదరులు భాగస్వాములు కావడం అభినందనీయం
* ఎమ్మెల్యే అరికెపుడి గాంధి
* మైనారిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గాంధీ
* కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నేశ్రీనివాస్ రావు.
ఎల్లమ్మబండ, నమస్తే ఎల్లంపల్లి: మత సామరస్యాన్ని కాపాడుతూ ముస్లిం మైనారిటీలు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధి అన్నారు. ఆల్విన్ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ జన్మభూమి కాలనీ బస్టాప్లో ఎల్లమ్మబండ మైనారిటి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ఆరికెపుడి గాంధి, ఆల్విన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, హైదర్నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నేశ్రీనివాస్ రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధి మాట్లాడుతూ మతసామరస్యాన్ని పెంపొందించే విధంగా ముస్లిం మైనారిటిలు సంక్రాంత్రి సంధర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని, తెలంగాణ గంగాజమున తహెజీబ్కు నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదని అన్నారు. జన్మభూమి కాలనీలో సంక్రాంతి వాతావరణం ముందే వచ్చినట్టు కనిపిస్తుందని అన్నారు. ఈ సందర్బంగా స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే గాంధి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఆల్విన్ డివిజన్లో అన్ని పండుగలు కుల మతాలకు అతీతంగా సోదరభావంతో అందరూ కలిసిమెలసి నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. కుల మతాలకు అతీతంగా అందరు కలిసి మెలసి పండుగలను జరుపుకుంటే ఐక్యమత్యం పెంపొందుతుందని అన్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించిన మైనారిటి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎంఏ. సమద్, ఎంఏ. కరీమ్, షౌకత్ అలీ, ఖాజా, షేక్ గౌస్, బడే ఖాజా, ఎండి. గౌస్, ఫేరోజ్, ఎండి. గౌసుద్దిన్లను ఎమ్మెల్యే అరికెపుడి గాంధి, కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్లు అభినందించారు. న్యాయ నిర్ణేతలుగా అవని ఫౌండేషన్ వ్యవస్థాపకులు శిరీషా సత్తూర్, రాజ్యలక్ష్మీ, మధులతలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సమ్మారెడ్డి, గౌరవ అధ్యక్షుడు అనిల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు రాజేష్ చంద్ర, సీనియర్ నాయకులు శివరాజ్ గౌడ్, బోయాకిషన్, జగదీష్, మౌలానా, ప్రదీప్ రెడ్డి, మైనారిటీ మహిళా అధ్యక్షురాలు షేక్ బీబీ, పుట్టం దేవి, సురేఖ, వాలి నాగేశ్వరరావు, ఇంతియాజ్, ఖాజా పాషా, యాఖుబ్, షఫీ, నాగరాజు, నాగేశ్వరరావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.