– వైభవంగా జరిగిన అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవం
హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అద్వర్యంలో నిన్న చర్లపల్లి డివిజన్ లోని సిరి గార్డెన్స్ వేదికగా శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజ వేద మంత్రోచ్చరణాల మద్య వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పుష్పగిరి శారదా లక్ష్మి నృసింహ్మ స్వామి వారుపాల్గొని ప్రత్యేక పూజలు చేసారు..
నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సకుటుంబ సమేతంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. మండల పడి పూజ సందర్భంగా రంగు రంగుల పూలతో అందంగా అలంకరించారు. బొంతు రామ్మోహన్ – శ్రీదేవి దంపతులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం మెట్లపూజ నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా అయ్యప్ప శరణు ఘోష దీక్షాపరుల నృత్యాలతో దేవాలయ ప్రాంగణం మార్మోగింది ఈ పడిపూజ మహోత్సవానికి ఉప్పల్ నలుమూలల నుండి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తులు హాజరయ్యారు అంతకుముందు మండపంలో పల్లకి సేవ నగర సంకీర్తన సాగింది.
ఈ సందర్భంగా బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ స్వామివారి పడిపూజ మహోత్సవం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలపై అయ్యప్ప స్వామివారి కృప, చల్లనిచూపు తప్పక ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ మాజీ చైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, యువ నాయకులు కర్నాటి విద్యసాగర్, నేవూరి దర్మెందర్ రెడ్డి, రెడ్కో చైర్మెన్ వై సతీష్ రెడ్డి, మాజీ కార్పోరేషన్ చైర్మెన్ సామ వెంకట్ రెడ్డి, యువ నాయకులు రామేశ్వర్ గౌడ్, కార్పోరేటర్లు స్వర్ణరాజ్ శివమణి, బన్నాల గీతా ప్రవీణ్, మాజీ కార్పోరేటర్లు గొల్లూరి అంజయ్య, గంధం నాగేశ్వర్ రావు, మేకల హన్మంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.