నవతరం

తెలుగు దినపత్రిక

సంక్రాతి ముగ్గుల పోటీలు

* మైనారిటీల ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటిలు

ఎల్లమ్మబండ, నమస్తే ఎల్లంపల్లి: ఎల్లమ్మ బండ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ, ఆదివారం ఉదయం 9 గంటలకు జన్మభూమి కాలనీ బస్టాప్ లో సంక్రాంతి ముగ్గుల పోటి నిర్వహించడం జరుగుతుంది. ఎల్లమ్మ బండ పరిసర ప్రాంత మహిళలు ఈ పోటీలలో పాల్గొనవలసిందిగా విన్నపం. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ, ఆల్విన్ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్య అతిథితులుగా హాజరు కానున్నారు. పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 5 వేలు, రెండవ బహుమతి 3 వేలు, మూడవ బహుమతి 2 వేల రూపాయలు నగదు బహుమతి అందజేయడం జరుగుతుంది. ముగ్గుల పోటీల్లో పాల్గొనే మహిళలు ముగ్గు, రంగులు వారే తీసుకు రావలసి ఉంటుంది. Contact for more info: 9959051786

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading