నవతరం

తెలుగు దినపత్రిక

పీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ

పెద్దవంగర, నమస్తే ఎల్లంపల్లి: మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో పీఆర్టీయూ టీఎస్‌ క్యాలెండర్‌, డైరీని మండల అధ్యక్షుడు గొట్టిముక్కుల శ్రీనివాస్ రెడ్డి, ఆధ్వర్యంలో రాష్ట్ర బాధ్యులు భూసాని సోమయ్య, సంకెపల్లి ప్రభాకర్ రెడ్డి, కాంప్లెక్స్ హెచ్ఎం విజయ్ కుమార్ లు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ పీఆర్టీయూ ముందుంటుందన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి పీఆర్టీయూ కృషి చేస్తుందని తెలిపారు. పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి రమేష్, జిల్లా బాధ్యులు సురేష్ కుమార్, అంజయ్య, యాకుబ్ పాషా, వెంకన్న, నాయకులు రవి, రాజేష్, శ్రీధర్, హైమ, సువర్ణ, నరేందర్ రెడ్డి, రమేష్, కవి రాజు, సత్యనారాయణ, బుచ్చయ్య పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading