నవతరం

తెలుగు దినపత్రిక

అంబేద్కర్ సర్కిల్ వద్ద వంట వార్పు

బోడుప్పల్లో “వక్ప్”బాధితుల నిరసన

అంబేద్కర్ సర్కిల్ వద్ద వంట వార్పు కార్యక్రమం

ప్రభుత్వం తక్షణమే వక్ప్ సమస్యను పరిష్కరించాలి

సమస్య పరిష్కారానికి మంత్రి మల్లారెడ్డి చొరవ చూపాలి

మేడ్చల్ జిల్లా, నమస్తే ఎల్లంపల్లి: గత ముప్పై ఏళ్లుగా లేని సమస్యను నాలుగేళ్లుగా వక్ప్ బోర్డు పేరుతో ఇంటి అనుమతులు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ లను ప్రభుత్వం ఆపివేయడాన్ని నిరసిస్తూ వక్ప్ బాధితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ విగ్రహం వద్ద వక్ప్ బాధిత కుటుంబాలు రోడ్డెక్కి వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వక్ప్ బాధితులకు బిజెపి, కాంగ్రెస్, శ్రేణులు, బోడుప్పల్ కాలనీల సంక్షేమ సంఘం తమ మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్ప్ బాధితులు మాట్లాడుతూ ఈ సమస్య ఏ ఒక్కరిదో కాదని సుమారు ఏడువేల కుటుంబాలకి సంబందించిన సమస్య ప్రభుత్వం చూడాలని పురుషులతో పాటు అధికసంఖ్యలో మహిళలు సైతం ధర్నాలో పాల్గొని తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారని ముప్పై సంవత్సరాలుగా పన్నులు చెల్లిస్తూ ఇంటి పన్ను, ఎల్ ఆర్ఎస్, బీఆర్ఎస్ చెల్లించి, బ్యాంక్ లోన్ల ద్వారా ఇండ్లు నిర్మించుకొని జీవనం కొనసాగిస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలపై, ఒక్కసారిగా వక్ప్ పేరిట రిజిస్ట్రేషను, అనుమతులను రద్దు చేయడం అన్యాయమని, ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని ఆవేదన వ్యక్తం చేసారు. గత ముప్పై ఏళ్లుగా లేని వక్స్ బోర్డు సమస్య, ఈ నాలుగేళ్లుగా తెరపైకి రావడంలో ఆంతర్యం ఏమిటని, తమ స్వార్థం కోసం కొంత మంది సమస్యను సృష్టిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు వక్ప్ బోర్డు సమస్య పరిష్కరిస్తా అని హామీ ఇచ్చిన స్థానిక మంత్రి మల్లారెడ్డి సమస్య పరిష్కారం కోసం బాధితులతో పాటు పోరాడాలని కోరారు. ఇప్పటికైనా కేసిఆర్, కేటీఆర్ ఈ సమస్యను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని లేని యెడల నిరసన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని, వచ్చే ఎన్నికల్లో నాయకులు దాని ఫలితాన్ని అనుభవిస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిరసన కార్యక్రమానంతరం బోడుప్పల్ కమిషనర్కు వినతి పత్రం అందించేందుకు బోడుప్పల్ అంబేద్కర్ విగ్రహం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టి కమిషనర్ కు వినతి పత్రం అందజేయడానికి ప్రయత్నించారు. అందుకు కమిషనర్ నిరాకరించి తమ సమస్యలను కలెక్టర్ కు నేరుగా విన్నవించాలని తెలపడంతో బాధితులు భవిష్యత్ కార్యాచరణ పై దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బిజెపి నాయకులు, బోడుప్పల్ కాలనీల సంక్షేమ సంఘం ఫెడరేషన్ సభ్యులు, వక్ప్ బాధిత మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading