నవతరం

తెలుగు దినపత్రిక

46 సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయాలన్న జగన్ మోహన్ రావు

కూకట్ పల్లి, నమస్తే ఎల్లంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవానికి భంగం కలిగించే బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 18 ఫేస్బుక్ పేజెస్, 24 ట్విట్టర్ హ్యాండిల్స్ & 4 ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల పూర్తి వివరాలుతో 24 పేజీల ఫిర్యాదుని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ సంబంధిత అధికారులకు ఈరోజు TSTS చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు ఫిర్యాదు చేయడం జరిగింది. సోషల్ మీడియా కమ్యూనిటీ స్టాండర్డ్స్ ని ఉల్లంఘించిన ఈ అకౌంట్ లని వెంటనే బ్లాక్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఇట్లాంటి చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడం జరిగింది. ఈ అకౌంట్ల పై సమగ్రమైన దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడం జరిగింది.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading