నవతరం

తెలుగు దినపత్రిక

పదవీ విరమణ పొందిన బాబామ్మ ను సన్మానించిన సీపీ

సైబరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌ లో 31.03.2023 నాడు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్. సైబరాబాద్ లో LGS (లాస్ట్ గ్రేడ్ సర్వీస్) గా విధులు నిర్వర్తించి, పదవీ విరమణ పొందినటువంటి డి. బాబమ్మను సన్మాన్మించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… ఉద్యోగ నిర్వహణలో సుధీర్ఘ కాలంగా అంకిత భావంతో పనిచేసి పదవీ విరమణ చేస్తున్న డి. బాబామ్మ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని సూచించారు. సమాజ సేవలో పాలు పంచుకోవాలన్నారు. రిటైర్ మెంట్ డబ్బును భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని డబ్బులను ఆచితూచి ఖర్చు చేయాలన్నారు. ఈ సందర్భంగా కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఫండ్ క్రింద 30,000/- రూపాయలు చెక్ ను బాబామ్మ కు అందచేశారు. అలాగే పొదుపు మొత్తము 2,60,000/-రూ. తన బ్యాంక్ ఖాతా లో జమ చేయడం జరిగిందని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీ తో పాటు పోలీసు అధికారుల సంఘం ట్రెజరర్ జి.మల్లేశం పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading