నవతరం

తెలుగు దినపత్రిక

ది గ్రేట్ పోస్ట్ మ్యాన్

* ఆదర్శం ఆ పోస్ట్ మ్యాన్…
* సార్ పోస్ట్ అంటూ పలకరింపు
* పలువురి మన్ననలు పొందుతున్న పోస్ట్ మ్యాన్ భద్రయ్య చారి

మెరిసిన తెల్లని తల.. సోడాబుడ్డి కళ్ళద్దాలు.. చెవిలో పెన్ను ..కాకి దుస్తులు ధరించి పొద్దున్నే ఆ గ్రామంలో వాలిపోతాడు. చేతిలో సంచి పట్టుకొని వారంలో ఏడు రోజులు గ్రామంలో ప్రతి వీధినంత మేల్కొల్పుతాడు. ఇంటిముందు కూర్చొని ఎదురుచూసే ముసలి అవ్వ మొదలుకొని వ్యాపారి, ఉద్యోగి, నిరుద్యోగి, యువతి యువకులతో పాటు ప్రతి ఒక్కరికి ఉత్తరాలు అందజేస్తున్నాడు. వయోభారం మీద పడిన కాలం అప్డేట్ అయినా చిరునవ్వులతో పలకరిస్తూ ఉత్తరాలు అందజేస్తున్నారు. రిటైర్డ్ మెంటుకు చేరువై గ్రామ వాసుల మన్ననలు చూరగొంటున్న పోస్ట్మాన్ బోగోజు భద్రాచరిపై ప్రత్యేక కథనం..


పెద్దవంగర, డిసెంబర్ 26, నమస్తే ఎల్లంపల్లి: మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రానికి చెందిన 65 వేల బోగోజు భద్రయ్య చారి తన వృత్తిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగంలో కొనసాగుతున్నాడు. జూన్ 9 1980లో పోస్ట్ మ్యాన్ గా కొలువులు చేరి నాటి తోరూర్ మండలంలోని చిన్న వంగర గ్రామంలో మొదటిసారిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టాడు. గ్రామంలో ఐదేళ్లపాటు విధులు నిర్వహించాడు. అనంతరం మండల కేంద్రంలోని 32 ఏళ్లుగా నేటికీ విధులు నిర్వహిస్తున్నాడు.


రోజుకు 35 నుంచి 40 వరకు ఉత్తరాలు పంపిణీ..
గ్రామ ప్రముఖులు వెనకదాసుల రామచంద్రయ్య శర్మ సహకారంతో 80వ దశకంలో పోస్ట్ మ్యాన్ గా ఉద్యోగం సాధించాడు. గ్రామంలో రోజుకు 35 నుంచి 40 ఉత్తరాలు పంపిణీ చేస్తాడు. పెద్ద వంగర తో పాటు నాలుగు తండాల్లోకి వెళ్లి నేటితరం యువకులతో సమానంగా ఉత్తరాలు పంపిణీ చేస్తున్నాడు. వయోభారం మీద పడిన క్రమం తప్పకుండా రోజువారిగా ఉత్తరాలను నిత్యం అందజేస్తున్నాడు. ఇన్నాళ్లు సైకిల్ తొక్కడంతో మోకాళ్ళ నొప్పులు దరిచేరాయి. దీంతో సైకిల్ తొక్కెందుకు కాళ్లు సహకరించకపోవడంతో ఇటీవల ఓ టీవీఎస్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసుకుని ఉత్తరాలను ఇంటింటికి తిరిగి అందజేస్తున్నాడు. ఏ ఒక్కరికి ఉత్తరం మిస్ కాకుండా లెటర్లు పంపించేసి విధుల్లో “అదుర్స్”అనిపించుకుంటున్నాడు.

20 ఏళ్ల వయసులోనే..
పదో తరగతి వరకు చదువుకున్న చారి 20 రెండేళ్లకే పోస్ట్ పోస్ట్ మ్యాన్ గా కొలువులో చేరాడు. బోగోజు రామచొక్కయ్యచారి-వెంకటమ్మ దంపతుల రెండో సంతానం భద్రయ్యచారి. ఆయన తోడ ఇద్దరు అన్న ఒక సోదరి ఉన్నారు. తల్లిదండ్రులు పేదరికంతో కొట్టుమిట్టాడుతుండడంతో పిల్లల పోషణ తల్లిదండ్రులకు భారంగా మారింది. దీంతో తండ్రి చేస్తున్న కుల వృత్తి వడ్రంగి పనులకు తోడ్పాటు అందిస్తూనే చిరు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. తన పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దాడు. కూతురును ఉన్నత కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేశాడు. ప్రస్తుతం ఆమె భర్త ఆ గ్రామంలో సర్పంచ్ గా సేవలు అందిస్తున్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading