సిద్దిపేట, నమస్తే ఎల్లంపల్లి: నాల్గోవ రోజు కానిస్టేబుల్ / ఎస్.ఐ మహిళ అభ్యర్థుల దేహధారుడ్య పరీక్షలు పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్ సమక్షంలో ఉదయం 5 గంటల నుండి నిర్వహించడం జరిగింది. 1013 అభ్యర్థులకు గాను, 886 అభ్యర్థులు హాజరు అందులో 578 అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారు. 127 మంది అభ్యర్థులు గైర్హాజరైనారు. ఉదయం 5:00 గంటల నుంచి మహిళ అభ్యర్థులకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్, బయోమెట్రిక్ తర్వాత 800 మీటర్ల పరుగు పందెం నిర్వహించి, ఎత్తు కొలిచి అర్హత సాధించిన అభ్యర్థులకు కొంత సమయం విశ్రాంతి కల్పించి తదుపరి ఈవెంట్స్ నిర్వహించడం జరిగింది. గ్రౌండ్లో మహిళ అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేసారు పోలీసులు. అందుబాటులో మెడికల్ టీం, అంబులెన్స్లు ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి పారదర్శకంగా, ప్రశాంతంగా కానిస్టేబుల్ / ఎస్సై ఎంపికలు జరుగుతున్నాయని, పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామనే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు సూచించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమీషనర్ తెలియజేశారు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే వెంటనే సమాచారం అందించాలని, అందించవలసిన ఫోన్ నెంబర్ 08457- 226333 సూచించారు పోలీసులు.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.