నవతరం

తెలుగు దినపత్రిక

‘బాషా భాయ్’ కి జన్మదిన శుభాకాంక్షలు

ఘనంగా ‘సూర్య ఉదయం’ ఎడిటర్ బాషా జన్మదిన వేడుకలు

కూకట్ పల్లి, డిసెంబర్ 27, నమస్తే ఎల్లంపల్లి: ‘సూర్య ఉదయం’ తెలంగాణ ఎడిటర్ బాషా జన్మదిన వేడుకలు హోసింగ్ బోర్డు లోని పెద్దమ్మ దేవాలయం వద్ద ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా కూకట్ పల్లి కి చెందిన విలేకరులు ఆయనకు తెలుగు దేశం పార్టీ నాయకులు నందమూరి సుహాసిని ని ఇంట్లోశాలువాలతో ఘనంగా సన్మానించి కేక్ కట్ చేసిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సూర్య ఉదయం తెలుగు దిన పత్రిక ఎడిటర్ బాషా ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఉన్నత శిఖరాలను చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ విలేకరులు రాహుల్, వేణు, క్రాంతి, నజీర్, మహేష్, రంజిత్, యాకయ్య, హరి కృష్ణ, నర్సింహా, రెహమాన్, షబ్బీర్, నాగరాజు, బలరాం, శ్యామ్ సుందర్, బంగారాజు, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం దర్గా చిన్న గౌడ్ (గోల్డ్ మాన్) బాషా జన్మదిన వేడుకల్లో పాల్గొని శాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మంచి మనసున్న మనిషి, పేదలకు సైతం తనవంతు సహాయం అందిస్తూ ఎల్లవేలలా అందరికి అందుబాటులో ఉంటే స్వభావం కలవాడు, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మన బాషా అని కొనియాడారు.

అనంతరం కుత్బుల్లాపూర్ సీనియర్ విలేకరులు సుగ్రీవుడు, ఎల్లంపల్లి నర్సింలు, సాయి, తోటి విలేకరులు పాల్గొని కేక్ కట్ చేసిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా వారికీ బాషా శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యలు తో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని,  అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

అనంతరం జబర్దాస్ట్ అదుర్స్ ఆనంద్ పాల్గొని కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ రిపోర్టర్లు పాల్గొని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లప్పుడూ నవ్వుతూ సుఖ శాంతోషాలతో నూరేళ్లు జీవించాలని ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూన్నట్లు తెలిపారు. అనంతరం బాషా మిత్రులు పాల్గొని కేక్ చేసిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటునట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో సద్దాం హుస్సేన్, సునీల్, సందీప్, రాంబాబు, బంటు, హుస్సేన్, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading