నవతరం

తెలుగు దినపత్రిక

ఆటో, లారీ యూనియన్ లకు ఇబ్బందులు లేకుండా చర్యలు

* ఐడిపిఎల్ జంక్షన్ అభివృద్ధి పనులను జెడ్సీతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఐడిపిఎల్ వద్ద చేపడుతున్న జంక్షన్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ జోనల్ కమిషనర్ మమత, స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్, ఎస్ఈ చెన్నారెడ్డి, బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. ఈ మేరకు ఫుట్ పాత్ నిర్మాణ పనుల్లో ఆటో, లారీ యూనియన్ సభ్యులకు ఇబ్బందులు ఎదురవడంతో బస్ షెల్టర్, ఆటో స్టాండ్ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా జంక్షన్ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఈ గోవర్ధన్, డిఈఈ శిరీష, ట్రాఫిక్ సీఐలు నరహరి, చంద్రశేఖర్, ఏఈ సంపత్, డిఈ రఘుపతి రెడ్డి, నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, స్థానిక డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏర్వ శంకరయ్య, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, పుప్పాల భాస్కర్, మాజీ అధ్యక్షుడు గౌసుద్దిన్, సీనియర్ నాయకుడు మహ్మద్ మక్సూద్ అలీ, నాయకులు, యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading