నవతరం

తెలుగు దినపత్రిక

సర్కిల్ 23 లో జోరుగా అక్రమ నిర్మాణాలు

* నామమాత్రానికే టి ఎస్ బి పాస్ చట్టం
* ఇప్పటివరకు ఎన్ని నోటీసులు ఇచ్చారు?…ఎన్ని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు?
* నోటీసులు ఇవ్వడం అందిన కాడికి దండుకోవడమే పనిగా టౌన్ ప్లానింగ్ అధికారులు
* అక్రమ నిర్మాణాలపై ఎవరికి వారే వసూల్ రాజా


కూకట్పల్లి, నమస్తే ఎల్లంపల్లి: కూకట్పల్లి సర్కిల్లో 23లో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎటు చూసినా అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కాలయాపన చేస్తూన్నారు. సర్కిల్లో కోకొల్లలుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల రాగానే ప్రజలు కట్టిన టాక్స్ లతో అధికారులు జీతాలు తీసుకుంటూ ఉద్యోగానికి తగిన న్యాయం చేయకపోవడంతో పాటు అక్రమ నిర్మాణదారుడు నుండి అందినకాడికి దండుకుంటూ ప్రభుత్వానికి గండి కొడుతూ అక్రమ నిర్మాణాలకు ఆజ్యం పోస్తున్నారని పలువురు స్థానికులు వాపోతున్నారు.అక్రమ నిర్మాణదారులు టి ఎస్ బి పాస్ చట్టాన్ని తుంగలో తొక్కి బహుళ అంతస్తుల నిర్మాణాన్ని చేపడుతున్నప్పటికీ అధికారులు నిద్రమత్తులో ఉన్నట్లు కనపడుతుంది. నిత్యం అక్రమ నిర్మాణాలపై నిఘా పెట్టి అక్రమ కట్టడాలను అడ్డుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ బిల్డింగ్ ల విషయంలో చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇంత బహిరంగంగా జిహెచ్ఎంసి కార్యాలయానికి కూతవేటు దూరంలో కైతలాపూర్ ప్రధాన రహదారిని ఆనుకొని ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా బహుళ అంతస్తు నిర్మాణాలు నిర్మిస్తున్నారంటే ఏ స్థాయిలో అధికారుల ఆశీస్సులు ఉన్నాయో ఇట్టే అర్ధమవుతుంది. ఈ అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసినప్పటికీ కేవలం నోటీసులు ఇచ్చి అందిన కాడికి దండుకోవడమే పనిగా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరికి వారే వసూల్ రాజా గా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.

అక్రమ నిర్మాణాలపై చర్యలు శూన్యం
ఈ అక్రమ నిర్మాణాల వల్ల ప్రజలకు జరుగుతున్న ఇబ్బందుల గురించి ఎన్నిసార్లు టౌన్ ప్లానింగ్ విభాగంలో ఫిర్యాదు చేసిన తగిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేస్తే కోతికి కొబ్బరి చిప్ప దొరికినంత ఆనందంలో టౌన్ ప్లానింగ్ అధికారులు రెచ్చిపోయినట్టు చేసి నోటీసు జారీ చేసి మీ అక్రమ నిర్మాణం పై కంప్లైంట్ వచ్చింది అని భయపెడుతూ అందిన కాడికి దండుకొని అటువైపు చూసిన పాపాన పోలేదు. గత కొన్ని నెలల నుండి ఇప్పటివరకు ఒక్క అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకున్న పాపాన పోలేదు సైతం ఇది ఇలా ఉండగా విజిలెన్స్ విభాగం సైతం దృష్టి సారించకపోవడం పై అక్రమ నిర్మాణాలు యదేచ్ఛగా కొనసాగుతున్నాయి. కానీ ఈ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేది ఎవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

నోటీసులు ఇచ్చాం
ఈ అక్రమ నిర్మాణాలపై చర్యల గురించి వివరణ కోరగా… నోటీసులు ఇచ్చాం, ఈ అక్రమ నిర్మాణాలను బుక్ చేసాం, ఒక్కొక్కటిగా… వరుసగా చర్యలు తీసుకుంటూ వస్తున్నాము, వీటి పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి సులువుగా తప్పించుకుంటున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading