నవతరం

తెలుగు దినపత్రిక

ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర గొప్పది

• బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఐలయ్య

పెద్దవంగర, నమస్తే ఎల్లంపల్లి: ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఎంతో గొప్పదని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీరాం సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో మానుకోట టైమ్స్ ఎలక్ట్రాన్ మీడియా 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను సీఈఓ బొడ్డు అశోక్, పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మీడియాలో పోటీతత్వం పెరిగిందనీ, ఆ పోటీతత్వంలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. సమాజంలో మార్పు కోసం మీడియా కృషి చేయాలనీ, సమస్యలను వెలికి తీయాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ముత్తినేని శ్రీనివాస్, బానోత్ వెంకన్న, కనుకుంట్ల వెంకన్న, బోనగిరి లింగమూర్తి, సర్పంచ్ చింతల భాస్కర్, మండల కోఆప్షన్ సభ్యుడు ఎండీ ముజీబ్, ఉపేందర్, అనిల్, సోమయ్య, వీరన్న, వెంకన్న పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading