• ప్రధానోపాధ్యాయుడు కవిరాజు
పెద్దవంగర, నమస్తే ఎల్లంపల్లి: బడి బయట పిల్లలను బడిలో చేర్పించాలని పెద్దవంగర ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాపాక కవిరాజు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన సీఆర్పీలతో కలిసి బడి బయట పిల్లల ఇంటింటి సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా కవిరాజు మాట్లాడుతూ..బడీడు పిల్లలందరినీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తమ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఈనెల 18 వరకు ఇంటింటి సర్వే చేపడుతుందని తెలిపారు. ప్రత్యేక కార్యచరణతో 0-14 సంవత్సరాలు, 15-19 సంవత్సరాల వయస్సు గల బడి బయట పిల్లల వివరాలను సేకరించి, స్థానిక పాఠశాలలో చేర్పిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఆర్పీలు నిరంజన్, రమాదేవి పాల్గొన్నారు.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.