నవతరం

తెలుగు దినపత్రిక

ఉచిత మెగా వైద్య శిబిరం

* నిరుపేదలకు తక్కువ ధరలో మెరుగైన వైద్య సేవలు

* వైద్య శిబిరంలో ఉచితంగా బీపీ, షుగర్, రక్త పరీక్షలు, మందుల పంపిణీ

మేడ్చల్ జిల్లా / పిర్జాదిగూడ, నమస్తే ఎల్లంపల్లి: మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఏడవ డివిజన్ కార్పొరేటర్ చంద్రకళ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో యుక్త హాస్పిటల్ వారి సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరంలో కంటి పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు ఉచితంగా చేసి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. అనంతరం యుక్త హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్. పురుషోత్తం మాట్లాడుతూ పీర్జాదిగూడ బోడుప్పల్ పట్టణ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు తక్కువ ధరలో అందించడమే లక్ష్యంగా యుక్త హాస్పిటల్ పనిచేస్తుందని, నిరుపేదలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ పేద ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తున్నామని బిపి, షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. అనంతరం డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ యుక్త హాస్పిటల్స్ 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉన్నాయని, అతి తక్కువ ధరలకే ఆపరేషన్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 150 మంది ప్రజలు 50 మంది గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు. ఈ క్యాంపులో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సింధు, ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాజేందర్, ప్రముఖ పీడియాట్రిషన్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ప్రియాంక, యుక్త హాస్పిటల్ ఎండి డాక్టర్ పురుషోత్తం, యుక్త హాస్పిటల్ జనరల్ మేనేజర్ ఖాజా ఖాన్ పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading