* మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ వెల్లడి
* కౌన్సిల్ సమావేశాలకు అనుమతించాలని టియుడబ్ల్యూజే ఐ జే యు ఆధ్వర్యంలో వినతి
మేడ్చల్ జిల్లా, నమస్తే ఎల్లంపల్లి: మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల సమగ్ర సమాచారాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసే విధంగా చర్యలు తీసుకుంటానని, మున్సిపల్ కమిషనర్ లకు తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం అదనపు కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు మాట్లాడుతూ జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల సర్వసభ్య సమావేశాలకు మీడియాను అనుమతించడం లేదని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కౌన్సిల్ సమావేశాల సందర్భంగా మీడియాకు కనీసంఎజెండా కాపీలను కూడా ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. చట్ట ప్రకారం కౌన్సిల్ సమావేశంలో జరుగుతున్న ప్రతి విషయం సాధారణ ప్రజానీకానికి తెలపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. కానీ మున్సిపల్ కమిషనర్లు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ కనీస సమాచారాన్ని కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. జర్నలిస్టులకు ఖచ్చితంగా పూర్తి సమాచారం తెలిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు స్పందించిన అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ ఖచ్చితంగా సమాచారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటానన్నారు. ముందస్తుగా ఎజెండా కాపీలు అందించడంతోపాటు కౌన్సిల్ సమావేశంలో జరిగిన చర్చ లను రికార్డు రూపంలో కూడా అందజేస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్ల అందరికీ కూడా ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్యూజే – ఐజేయూ మేడ్చల్ జిల్లా కార్యదర్శి డి.వెంకట్ రాంరెడ్డి, జిల్లా స్టాఫర్ లు కృష్ణ, శ్రీరాములు, జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శులు రచ్చ శ్రీనివాస్, రవీందర్, బాల్ రెడ్డి, నాగరాజు, సహాయ కార్యదర్శి డి.రాజిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రవీణ్, రాయుడు, వెంకట్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటగడ్డ శ్రీనివాస్, కార్యదర్శి సాయిబాబా, కోశాధికారి శేషారెడ్డి, మేడిపల్లి మండల ప్రెస్ క్లబ్ ప్రదాన కార్యదర్శి కల్కూరి ఎల్లయ్య,కో అర్డినేటర్ వడ్డెమాను సుందర్, కార్యవర్గ సభ్యులు మారటి మల్లేష్, సభ్యులు చిన్నం గణేష్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.