నవతరం

తెలుగు దినపత్రిక

సంక్రాంతి సెలవుల్లో జాగ్రత్తగా ఉండండి

సంక్రాంతి సెలవుల సందర్భంగా విద్యార్థులు గాలిపటాలు ఎగరవేయడం ఆనవాయితీ ఆనందంగా ఎగురవేస్తూ కేరింతలు వేస్తారు, కానీ కొందరు దుర్మార్గులు దుకాణదారులు ప్రభుత్వం నిషేధించిన మాంజ, చైనా మాంజా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. దీనివల్ల పిల్లల ప్రాణాలకు రోడ్డుపై వెళ్లే ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాలు జరిగి, ఆ దారంతో చేతులు, మెడలు కోసుకుపోవడం చూస్తూనే ఉన్నాం. కావున ఇటువంటి చైనా మాంజ ఎవరైనా విక్రయించినచో పోలీసులకు గాని గ్రామ పెద్దలకు సమాచారం ఇవ్వాలి. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు పోలీసులు కూడా వారిపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. సెలవుల్లో విద్యార్థులు గ్రామాలకు వెళ్ళినప్పుడు చెరువుల్లో కుంటల్లో కాలువల్లో సరదాగా ఈత కొట్టడానికి వెళతారు. ఈత రానివారు మీరు తాగి చేతులు నీళ్లపై కొట్టకుండా ప్రాణాలు వదులుతారు చనిపోతారు కావున ఈతరాని వారు నీటిలో దిగకుండా చూడవలసిన బాధ్యత తల్లితండ్రులది మరియు పట్టణం వదిలి గ్రామాలకు వెళ్లినప్పుడు మీ ఇంటిలో విలువైన వస్తువులు బంగారం వెండి డబ్బులు బ్యాంకులో కానీ మీకు తెలిసిన వారి వద్ద ఉంచగలరని తెలుపుతూ దొంగలు తాళం వేసిన ఇండ్లను రెక్కీ చేస్తూ దొంగలిస్తారు. ఈ అవగాహన సదస్సులు షాపూర్ నగర్ జెడ్పి పాఠశాలలో సూరారం నార్సిటీ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు శివపార్వతి ఎం.డి అఖిల్ అరవింద్ నందు ప్రవీణ్ అనిల్ పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading