నవతరం

తెలుగు దినపత్రిక

ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ (ఐజీ)కి ఘణంగా వీడ్కోలు

* ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్., (ఐజి) కి ఘనంగా వీడ్కోలు పలికిన రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు, సిబ్బంది
* శాంతి భద్రత ల పరిరక్షణ అదుపులో ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యం
* ప్రజా శాంతి, శాంతి భద్రత ల పరిరక్షణ కోసం క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసిన అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలిపిన పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్

రామగుండం, నమస్తే ఎల్లంపల్లి: రామగుండం పోలీస్ కమిషనరేట్ లో గత 16 నెలల నుంచి రామగుండం పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వహించిన ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్., (ఐజి) బదిలీపై ఐజిపి మల్టీ జోన్ -1 గా వెళ్లారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులు (farewell) ఏర్పాటు చేసి కార్యక్రమంలో సీపీ కి పెద్దపల్లి, మంచిరాల జిల్లాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొని గజమాలతో సన్మానం చేసి పుష్పగుచ్ఛాలు అందించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… శాంతి భద్రతల పరిరక్షణ, లాండ్ ఆర్డర్ సమస్య లేకుండా అదుపులో ఉన్నప్పుడే చాలా పరిశ్రమల ఏర్పాటు చేస్తారని, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అందరికి ఉపాధి దొరుకుతుంది అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉన్న సింగరేణి, పవర్ ప్లాంట్స్ , ఇతర ఫాక్టరీ లలో, ఇతర ప్రాజెక్ట్ ల విషయం లో ఎలాంటి సమస్య లేకుండా లా ఆర్డర్ సమస్యలు లేకుండా చూడగలగమని అన్నారు. ప్రజాశాంతి కోసం రాజీపడకుండా తనతో పాటు తన ఆదేశాల ప్రకారం క్రమశిక్షణతో, అంకితభావంతో సమిష్టిగా కృషి చేసినందుకు పేరుపేరునా హోం గార్డ్ ఆఫీసర్స్ నుండి ఉన్నత అధికారుల వరకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 16 నెలల పాటు రామగుండం కమిషనరేట్ లో పని చేసే అవకాశం రావ డం సంతోషాన్ని ఇచ్చిందని, సమర్థవంతంగా పనిచేసిన మధుర స్మృతులతో బదిలీ పై వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ అధికారులు ఉత్తమ సేవలందిస్తే గుర్తింపు పొందుతారని, పోలీస్ అధికారులు సిబ్బంది రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. కమిషనరేట్ పరిధిలో పీపుల్ ఫ్రెండ్లీ పేరుతో ప్రజలకు దగ్గర కావడంతోపాటు అన్ని రకాల కార్యక్రమాలు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. వరదల సమయంలో ఎలాంటి చిన్న అవాంఛనియ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించిన అందరికీ అభినందనలు తెలిపారు. ప్రజలు ప్రశాంతమైన జీవనంలో ఉండేందుకు చట్ట పరిధిలో తన వంతు పూర్తి స్థాయిలో బాధ్యత నిర్వహించానని అన్నారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల ప్రజలకు ఇతర ప్రభుత్వ శాఖల అధికారుల కు మీడియా మిత్రులకు అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రూపేష్ ఐపిఎస్., మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ ఐపిఎస్., బెల్లంపల్లి ఏసీపీ మహేష్, గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్, పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి మోహన్, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, జైపూర్ ఏసీపీ నరేందర్, ట్రాఫిక్ ఏసీపీ బాల్ రాజ్, ఏసీపీ ఉపేందర్, వెంకటేశ్వర్ రావు, ఏఆర్ ఏసీపీ సుందర్ రావు, మల్లికార్జున్ ఏవో నాగమణి, సూపరిండెంట్స్, సిసి శ్రవణ్ కుమార్, రెండు జిల్లాల పరిధిలోని సీఐ లు,ఆర్ఐ లు, ఎస్ఐ లు, ఆర్ఎస్ఐ లు, సీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading