బొల్లారం, నమస్తే ఎల్లంపల్లి: బొల్లారం మున్సిపల్ ప్రాంతంలో ఎస్సీ కాలనీలో పొట్ట కోసం ఇతర రాష్ట్రం వచ్చి జీవిస్తున్న బిఆర్వాసి శివలాల్ వయసు 35 సంవత్సరాలు గుండె నొప్పి వచ్చి చనిపోవడం జరిగింది. అది తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకుడు, సామాజిక వెత్త, మానవతావాది,బిజెపి నాయకుడు కేజెఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి శివ లాల్ భార్య ఇద్దరు పిల్లలు వాళ్ల బాధను చూడలేక చలించి ఓదారుస్తూ ఆ కుటుంబ సభ్యులకి మీరు బాధపడకండి అమ్మ నేను నీకు అన్న లాంటి వాన్ని మీకు ఏ కష్టం వచ్చినా ఏదైనా ఇబ్బంది ఉన్న నాకు ఫోన్ చేయమని చెప్పి ఆ కుటుంబ సభ్యులకు అంతక్రియలకు పదివేల రూపాయలు సాయం చేయడం జరిగింది. అక్కడ స్థానికులు కేజేఆర్ ఆనందకృష్ణారెడ్డి కి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఈసంర్బంగా ఆనంద్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ నాకు కృతజ్ఞతలు చెప్పే ముందు దయచేసి మీరందరూ హెల్త్ పాలసీ బీమా పథకం చేయించుకోవాలని, ఈ రోజుల్లో ఎప్పుడు ఏ టైంలో ఏ ఇబ్బంది వస్తుందో తెలియదు కావున అందరూ హెల్త్ పాలసీ బీమా పథకం చేయించుకుంటే మన కుటుంబ సభ్యులకు అంతో ఇంతో ఆసరాగా ఉంటుందని స్థానికులకు చెప్పడం జరిగింది. స్థానికులు మాట్లాడుతూ తప్పకుండా సార్ మేము ఇంతకుముందు తప్పు చేశాము ఇక నుంచి అలాంటి తప్పులు చేయకుండా మా భార్య పిల్లల మీద దృష్టి పెట్టి ఈ హెల్త్ పాలసీ బీమా ప థకం చేయించుకుంటామని చెప్పడం జరిగింది.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.