నవతరం

తెలుగు దినపత్రిక

యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద

– మాధవరం కాంతారావు

కూకట్పల్లి, నమస్తే ఎల్లంపల్లి: అంతర్జాతీయ వేదికపై భారతీయ అధ్యాత్మికతను చాటిన మహనీయుడు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని గురువారం కూకట్పల్లి అసెంబ్లీ బిజెపి కార్యాలయంలో జాతీయ యువజన దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్పల్లి అసెంబ్లీ బిజెపి ఇంచార్జి మాధవరం కాంతారావు హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ భారతీయ సనాతన సాంస్కృతిక వారధి, హిందూ ధర్మసారథి, అణువణున దేశభక్తి, కణకణమున ధర్మానురక్తి, భారతదేశాన్ని జాగృతపరిచిన మహర్షి, అనునిత్యం దేశం కోసమే తపించిన తాపసి, శ్రేష్ఠ సన్యాసి, మన స్వామి వివేకానంద, తన వాక్చాతుర్యంతో యావత్ మానవాళిని సంఘటితం చేసిన మహానుభావుడిగా చిరకాలం నిలిచిపోయారు. ముఖ్యంగా భారతదేశ గొప్పదనాన్ని, దేశ సంస్కృతీ సంప్రదాయాల విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పిన ఘనుడు. అలాంటి వివేకానందుడితో మన భాగ్యనగరానికి విశేష అనుబంధం ఉంది. తెలంగాణ సమాజాన్ని మొత్తం తన గుప్పిట్లో పెట్టుకుని తాను ఆడిందే ఆట.. పాడిందే పాటగా రాజ్యపాలన సాగిస్తున్న నిజాం కోలువులోకి తొలిసారి అడుగు పెట్టిన వివేకానందుడు.. హైందవ ధర్మ గొప్పతనం, వేదాలు, ఉపనిషత్తుల ప్రాధాన్యత, నైతిక ఆదర్శాల గురించి ప్రసంగించి ఔరా అనిపించారు. భారత ప్రభుత్వం స్వామి వివేకానంద జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది, వివేకానంద నిజమైన కర్మయోగి… ఈ దేశ యువతపై పూర్తి విశ్వాసం కలిగి ఉన్నాడు. యువత తమ కృషి, అంకితభావం.. ఆధ్యాత్మిక బలం ద్వారా భారతదేశ విధిని మార్చగలరని ఆయన దృఢంగా విశ్వసించారు. యువతకు ఆయన సందేశం ఏమిటంటే, “నాకు ఇనుప కండరాలు .. ఉక్కు నరాలు ఉండాలనుకుంటున్నాను, దాని లోపల పిడుగులు చేసే అదే మనస్సు ఉంటుంది.” ఇలాంటి సందేశాల ద్వారా యువతలో ప్రాథమిక విలువలు నింపేందుకు ప్రయత్నించారు. నేటి యువత వివేకానందను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలని ఈ సందర్భంగా కాంతారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి, బిజెవైయం నేతలు కార్యకర్తలు, స్థానిక యువకులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading