నవతరం

తెలుగు దినపత్రిక

స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

* యువకులారా మేల్కొండి – స్వామి వివేకానంద స్పూర్తితో కుత్బుల్లాపూర్ లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ల అరాచకాలను తరిమికొడదాం

రంగారెడ్డి నగర్, నమస్తే ఎల్లంపల్లి: రంగారెడ్డి నగర్ లో స్వామి వివేకానంద జయంతి సందర్బంగా వల్లపు కృష్ణ వేణు కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ హాజరై, స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఇటీవల అకాల మరణం చెందిన వివేకానంద విగ్రహ ప్రతిష్టాపకులు దివంగత వల్లపు కృష్ణ ను స్మరిస్తూ, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. స్వామి వివేకానంద స్పూర్తితో రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గపు పాలనను, కుత్బుల్లాపూర్ లో అవినీతి, భూకబ్జాలు చేస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అరాచక పాలనను తరిమికొట్టాలని ఈ జీన్స్ ప్యాంటు, టీ షర్ట్ లు వేసుకున్న యువతకు మాజీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అనంతరం వృద్దులకు దుపట్టాలను పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్, జయంతి నిర్వహణ కమిటీ సభ్యులు మోతే శ్రీనివాస్ యాదవ్, రవీందర్ రెడ్డి, హరికిషన్ రెడ్డి, శ్రీనివాస్, ఉమేందర్, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బుచ్చి రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గరిగె శేఖర్ ముదిరాజ్, డివిజన్ అధ్యక్షులు పరుష వేణు, మణికంఠ, సంజయ్, ప్రవీణ్, రంగా శ్రీనివాస్ గౌడ్, బండారి నారాయణ, వేణు, గోపాల్, తోకల శ్రీను, షాకీర్, సందీప్, గఫ్ఫార్, చోటు, శ్రీకాంత్, శ్రవన్ తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading