నవతరం

తెలుగు దినపత్రిక

సిపిఐ పార్టీ సభ్యత 2023 నమోదు కార్యక్రమం

మేడిపల్లి, నమస్తే ఎల్లంపల్లి: సిపిఐ పార్టీ మేడిపల్లి మండల కార్యదర్శి జిల్లా కార్యవర్గ సభ్యులు రచ్చ కిషన్ ఆధ్వర్యంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేపట్టినారు. ఇందిరానగర్ కార్యదర్శి మాచర్ల కనకయ్య శాఖ పరిధిలో సభ్యత నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగినది. రచ్చ కిషన్ మాట్లాడుతూ శ్రామికులు, కార్మికులు అధిక సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని ఈసారి మండలంలో అధిక సంఖ్యలో సభ్యత్వ నమోదు అవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. ఏఐటీయూసీ మండల కార్యదర్శి దండు రమేష్, లక్ష్మి, సరస్వతి సుజాత, ప్రవీణ్, అనసూయ, సంధ్య, కవిత, దాసరి, నర్సమ్మ బొడ్డు మహాలక్ష్మి, ఎం. భువనేశ్వరి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading