నవతరం

తెలుగు దినపత్రిక

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి ముగ్గులు

* ఏసిపి వెంకట్ రెడ్డి

జగద్గిరిగుట్ట / అబిడ్స్ / హైదరాబాద్: తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక గా సంక్రాంతి ముగ్గులు నిలుస్తాయని అబిడ్స్ ఏసిపి. వెంకట్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూం నగర్ లో గల శ్రీ చైతన్య విద్యానికేతన్ పాఠశాలలో మేడ్చల్ జిల్లా ట్రాస్మా అధ్యక్షులు, పాఠశాల చైర్మన్, కరస్పాండెంట్ శివరాత్రి యాదగిరి ఆధ్వర్యంలో పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు వారి తల్లులచే రంగేళి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతోపాటు జగద్గిరిగుట్ట సిఐ పి. సైదులు, ఐఎన్టియుసి రాష్ట్ర అధ్యక్షులు గుంజా శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ గూడ వరమ్మ, ఎస్సై యాదగిరి ముగ్గులు తిలకించారు. పేరెంట్స్ విభాగంలో ప్రథమ బహుమతి తరిగొప్పుల జ్యోతి, రెండో విజేతగా స్వాతి, మూడో విజేతగా యశోద, ప్రోత్సాహక బహుమతి చంద్రకళ తోపాటు విద్యార్థుల విభాగంలో ప్రథమ బహుమతి రాగవర్షిని, రెండవ బహుమతి ప్రజ్ఞతేజ, మూడో బహుమతి వి. అక్షయ గెలుపొందారు. విజేతలుగా నిలిచిన వారికి నగదు పారితోషికం తో పాటు ప్రోత్సాహక బహుమతులను వారు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీస్తే సమాజంలో పేరు ప్రఖ్యాతలు వస్తాయన్నారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పీ. సైదులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు ఎంతో విశిష్టత ఉందని, మహిళల్లో సృజనాత్మకత వెలికి తీయడానికి దోహదపడతాయన్నారు. పాఠశాల కరస్పాండెంట్ శివరాత్రి యాదగిరి మాట్లాడుతూ ప్రతి ఏడు సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులను వారి తల్లిదండ్రులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శివరాత్రి మంగ, నాయకులు మోజెస్, రాము, ఇంచార్జ్ గీత, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading