మేడ్చల్ జిల్లా బ్యూరో, నమస్తే ఎల్లంపల్లి: మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని యుక్త హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ రాజేందర్ ఆధ్వర్యంలో యుక్త హాస్పిటల్స్ – 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో యుక్త హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ సింధు, యుక్త హాస్పటల్ జనరల్ మేనేజర్ కాజా ఖాన్, హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొని నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ పురుషోత్తం మాట్లాడుతూ యుక్త హాస్పిటల్స్ ప్రారంభించిన అనతి కాలంలోనే నిరుపేదలకు అత్యుత్తమ సేవలు అందిస్తూ మంచి పేరు సంపాదించిందని పీర్జాదిగూడ, బోడుప్పల్ పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటు ధరలలో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామని, 2023 నూతన సంవత్సరం సందర్భంగా రక్త పరీక్షలకు సంబంధించిన ఫీజులో 30 నుండి 40 శాతం, మందులకు 10 శాతం రాయితీ అందిస్తున్నామని అన్నారు. అనంతరం డాక్టర్ రాజేందర్ మాట్లాడుతూ 24 గంటలు అనుభవజ్ఞులైన డాక్టర్లు అందుబాటులో ఉంటారని అన్ని రకాల క్రిటికల్ కేర్ సేవలు, శస్త్ర చికిత్సలు అందుబాటు ధరలో నిర్వహిస్తామని తెలియజేస్తూ ప్రజలకు యుక్త హాస్పిటల్స్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.