* అంత్యక్రియలకు ఆర్ధికసాయం అందజేసిన కాశీనాథ్ యాదవ్
మేడ్చల్ జిల్లా/కూకట్ పల్లి/జనవరి17, నమస్తే ఎల్లంపల్లి: ఆల్విన్ కాలనీ 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ కు చెందిన ఎం రమేష్ 32 సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది ఈ విషయం తెలుసుకొని అతని కుటుంబానికి సాయం చేయడానికి 124 డివిజన్ వార్డ్ మెంబర్ కాశీనాథ్ యాదవ్ ముందుకచ్చి వారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ కులానికి చెందిన ఏ కుటుంబానికైనా సరే నేను సాయం చేయడానికి ముందుంటనని తెలియజేశారు. ఈ రోజు యాదవ కుటుంబానికి సంబంధించి సమస్య వచ్చిందని తెలుసుకొని వెంటనే సాయం చేయడానికి ముందుకు వచ్చానని కాశీనాథ్ తెలియజేశారు. భవిష్యత్ లో యాదవ కులస్థులకు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్న నా వంతు సహాయం తప్పక ఉంటుందని అన్నారు.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.