నవతరం

తెలుగు దినపత్రిక

వెంటిలేటర్ బహుకరించిన కెనెరా బ్యాంక్

* రాందేవ్ రావు ఆసుపత్రికి పెడియాట్రిక్ వెంటిలేటర్ బహుకరించిన కెనెరా బ్యాంక్

కూకట్పల్లి, నమస్తే ఎల్లంపల్లి: రాందేవ్ రావు ఆసుపత్రి అందిస్తున్న ఉచిత సేవలను పలువురు కొనియాడారు. వివరాల్లోకి వెళితే కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని వివేకానంద నగర్ ప్రాంతంలో రాందేవ్ రావు ట్రస్ట్ తరపున ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. ఈ ఆసుపత్రికి వచ్చే నిరుపేదలకు ఉచిత వైద్యం కూడ అందిస్తున్నారని, ఇది తెలుసుకున్న కెనెరా బ్యాంక్ వారు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద 16 లక్షల విలువ గల పెడియాట్రిక్ వెంటిలేటర్ ను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రాందేవ్ రావు ఆసుపత్రి చైర్మన్ విక్రమ్ దేవ్ రావు, ట్రస్ట్ సభ్యులు ప్రశాంత్ రెడ్డి, గౌరవ కార్యదర్శి మీరా రావు, మెడికల్ డైరెక్టర్ కమలాకర్, డిప్యూటీ డైరెక్టర్ సూర్య వంశీ, సీఈఓ యోబు, బ్యాంక్ మేనేజర్ మోహన్ క్రిష్ణ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading