* మృత దేహాన్ని తరలించేందుకు అంబులెన్సు దారి ఖర్చులకు ఆర్థిక సహాయం అందచేసిన కెజెఆర్ ఆనంద్ క్రిష్ణ రెడ్డి
బొల్లారం, నమస్తే ఎల్లంపల్లి:గాలిపటం పట్టుకోవడానికి వెళ్లి విద్యుత్ తీగలు తగిలి ఓ బాలుడు మరణించిన ఘటన బొల్లారం మున్సిపల్ పరిధిలోని మల్లన్న బస్తి కాలనిలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతి చెందిన బాలుడి మృతదేహాన్ని పఠాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్తం నిమిత్తం తరలించారు.ఈ విషయం తెలుసుకున్న బొల్లారం బీజేపీ నాయకుడు కెజెఆర్ ఆనంద్ కృష్ణా రెడ్డి బుధవారం ఉదయం ఆ బాలుడి కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం పఠాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పోస్టుమార్తం నిర్వహించే సమయంలో మృతుడి కుటుంబ సభ్యులకు అండగా నిలిచి మనోధైర్యాన్ని అందించారు. మృతి చెందిన బాలుడి స్వగృహం కృష్ణా జిల్లా నందిగామ మండలం ఇక్కడ నుండి సూదురం కావడంతో అంబులెన్సు మాట్లాడి అంబులెన్సు రవాణా ఖర్చులు మొత్తం తానే అందచేశారు. అందులో భాగంగా 10 వేల రూపాయలు తక్షణ సహాయం చేశారు. అంతేకాకుండా ఆ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మృతి చెందిన బాలుడి కుటుంబాన్ని ఆదుకోవాలని బిజెపి నాయకుడు కె జె ఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేసారు. కాగా తమ కుటుంబానికి ఆపద సమయంలో వెన్నంటి ఉండి తమలో మనో ధైర్యాన్ని నింపినందుకు, ఆర్థికంగా తమను ఆదుకున్నందుకు బాధిత కుటుంబ సభ్యులు ఆనంద్ కృష్ణా రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.