నవతరం

తెలుగు దినపత్రిక

కూకట్ పల్లి అసెంబ్లీ మున్నూరు కాపు కన్వీనర్ గా ఎస్.రేవతి పటేల్

కూకట్పల్లి, నమస్తే ఎల్లంపల్లి : బీజేపీ మేడ్చల్ జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు ఎస్ రేవతి పటేల్ కూకట్ పల్లి మున్నూరు కాపు అసెంబ్లీ కన్వీనర్ గా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండా దేవయ్య, స్టేట్ కన్వీనర్ బండి పద్మ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మహేందర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ కన్వీనర్ల నియామకం హైదరాబాద్ నారాయణగూడ ఆఫీసులో నియమించారు. కూకట్ పల్లి అసెంబ్లీ మున్నూరు కాపు సంఘం కన్వీనర్ గా ఎస్.రేవతి పటేల్,కుత్బుల్లాపూర్ కన్వీనర్ గా తోట అలివేలు, మల్కాజ్ గిరి కన్వీనర్ గా అంబటి జ్యోతిర్మయ్ ని నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రేవతి పటేల్ మాట్లాడుతూ నామీద నమ్మకంతో నాకు ఈ పదవి బాధ్యతలు అప్పగించిన కాపు సంఘం పెద్దలకు కృతజ్ఞతలు అని, కాపుల అభివృద్ధికి నా శాయశక్తుల కృషి చేస్తానని, ఎవరికి ఏ ఆపద వచ్చిన ముందుండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం కేపి హెచ్ పి కాలనీ డివిజన్ బిజెపి అధ్యక్షుడు గంధం రాజు శుక్రవారం ఎస్ రేవతి పటేల్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పులబోకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading