నవతరం

తెలుగు దినపత్రిక

నేషనల్ హ్యూమన్ రైట్స్ కార్యాలయ ప్రారంభోత్సవంలో బెనర్జీ

మేడ్చల్, నమస్తే ఎల్లంపల్లి: 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త సంఘసంస్కర్త హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రొండ మల్లారెడ్డి గారికి చెందిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కార్యాలయ ప్రారంభోత్సవం మేడ్చల్ చౌరస్తాలోపలువురు ప్రముఖుల సమక్షంలో అట్టహాసంగా జరిగింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సెక్రటరీ బెనర్జీ ముఖ్యఅతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో పలువురికి న్యాయం చేకూర్చాలని దిశగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారు చేపడుతున్న పలు కార్యక్రమాలకు మరింత సౌలభ్యం చేకూర్చేందుకు డాక్టర్ రొండ మల్లారెడ్డి స్థాపించిన ఈ కార్యాలయం ఉపకరిస్తుందని పలువురు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా డాక్టర్ రొండ మల్లారెడ్డి గత రెండున్నర దశాబ్దాలుగా చేపడుతున్న పలు ఆధ్యాత్మిక సాంఘిక సేవా కార్యక్రమాలను కూడా పలువురు కొనియాడారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కి చెందిన పలువురు ప్రముఖులతో పాటు అధ్యక్షురాలు షీబాజీ, సౌత్ ఇండియా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కు చెందిన ఆర్.ఎస్.జే థామస్, ప్రెసిడెంట్ కొత్వాల్ దయానంద్, సంతోష్ రెడ్డి, పంపేటి ఎంపీపీ హరికృష్ణ, రాజశేఖర్ గౌడ్, వేణు గోపాల్ రెడ్డి, కృష్ణ యాదవ్, అమరేందర్ రెడ్డి, అశోక్ యాదవ్ తదితరులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading