సైబరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ఈరోజు ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ముందుగా సైబరాబాద్ పోలీసు కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపిఎస్., జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ముందుగా ప్రజలు, పోలీస్ సిబ్బంది, మీడియా కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మనకు 1947, ఆగస్ట్ 15న స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, ఇంకా బ్రిటీష్ రాచరిక పాలనా విధానాన్నే అనుసరిస్తున్నామని భావించిన ఎందరో గొప్ప మహానుభావులు రాజ్యంగ రచన దిశగా అడుగులు ముందుకు వేశారన్నారు. రాజ్యాంగ రచన కోసం అప్పటి మహానుభావులు ప్రపంచంలోని నలుమూలల సందర్శించి.. ఆ యొక్క దేశాల రాజ్యాంగాలు, చట్టాలు రాజ్యంగ నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలు, చట్టాలను పరిశీలించి అందులోనుంచి కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని మన భారత రాజ్యాంగాన్ని లిఖిత పూర్వకంగా రచించారు. ఈ రాజ్యాంగాన్ని డా. బిఆర్ అంబేద్కర్, డా . రాజేంద్ర ప్రసాద్ లు రచించడంలో ఒక ముఖ్య పాత్ర పోషించారు. డా.బిఆర్ అంబేద్కర్ కు ముసాయిదా కమిటీని అప్పగించారు. ఈ లికితపూర్వక రాజ్యాంగాను పూర్తి చేయడానికి 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల సమయం పట్టింది . అయితే 1949 నవంబర్ 26 వ తేదిన రాజ్యాంగ సభ ఆమోదించినప్పటికీ, 1950 జనవరి 26 వ తేదిన ఉదయం 10 గం ॥॥ 18 ని ॥ నుండి 395 అధికరణలు, 22 భాగాలు, 8 షెడ్యూల్లుగా భారత రాజంగం అమల్లోకి వచ్చిందన్నారు. 1950, జనవరి 26వ రోజున మనకు రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. భారత దేశాన్ని సర్వసత్తాక, లౌఖిక, సామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర సాంఘిక, సంక్షేమ, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, సమానత్వాన్ని చేకూర్చటానికి, జాతి సమైక్యతను, సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు వీలుగా భారత రాజ్యంగాన్ని రూపొందించారు. బ్రిటన్ పార్లమెంటు నుంచి ఏక పౌరసత్వం, పార్లమెంటరీ విధానం, అమెరికా నుంచి సుప్రీం కోర్టు, న్యాయ వ్యవస్థ అధికారం, ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నికలు, రష్యా నుంచి ప్రామిక విధులు, కెనడా నుంచి కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, జర్మనీ నుంచి అత్యవసర పరిస్థితులు వంటి వాటిని తీసుకున్నామన్నారు. రాజ్యాంగం ద్వారానే భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందన్నారు. భారత దేశం ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమన్నారు. భారత రాజ్యాంగం కుల, మత, లింగ వివక్ష భేదం లేకుండా అందరికీ సామాన్య హక్కులను, బాద్యతలను, అవకాశాలను కల్పించిందన్నారు. దేశం కోసం పోరాడిన ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ.. వారి త్యాగలను గుర్తు చేసుకుంటూ ప్రజాసేవకు అంకితమవ్వాలన్నారు. సైబరాబాద్ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ తో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అత్యుత్తమ సేవలు అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్., సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ్ నాయక్, ఐపీఎస్., సైబరాబాద్ డిసిపి ట్రాఫిక్ టి శ్రీనివాస రావు, ఐపీఎస్., మాదాపూర్ డిసిపి శిల్పవల్లి, శంషాబాద్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి, విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ డిసిపి కవిత, డిసిపి ఇందిరా, డీసీపీ లావణ్య, సైబర్ క్రైమ్స్ డిసిపి రితిరాజ్, ఐపీఎస్., రోడ్ సేఫ్టీ డిసిపి ఎల్ సి నాయక్, ఏడిసిపీలు, ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లు, మినిస్టీరియల్ స్టాఫ్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.