నవతరం

తెలుగు దినపత్రిక

తోటి కానిస్టేబుల్లు ఆర్ధిక సహాయం

* పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి తోటి కానిస్టేబుల్లు ఆర్ధిక సహాయం

సైబరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో పనిచేస్తూ.. గత డిసెంబర్ -2022 లో అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్‌ నాగేశ్వర్ రావు (1993 బ్యాచ్) మృతి చెందాడు. తన తోటి కానిస్టేబుళ్లు కలిసి సైబరాబాద్ పోలీసు కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్ సమక్షంలో నాగేశ్వర్ రావు భార్య వరలక్ష్మి మరియు కుటుంబసభ్యులకు రెండు లక్షల యాబై వేలు (రూ. 2,50 000) నగదును అందజేయడం జరిగింది. నాగేశ్వర్ రావు కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించిన తోటి 1993 సైబరాబాద్ బ్యాచ్ హెడ్ కానిస్టేబుళ్లను సీపీ అభినందించారు. మరణించిన పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి మిగతా బెనిఫిట్స్ త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సీపీ సంబంధిత అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీ తో పాటు తోటి కానిస్టేబుళ్లు బాలకృష్ణ, యాహియా షరీఫ్, ఎన్‌ఎం ఖాజా, నాగేశ్వర్ రావు కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading