నవతరం

తెలుగు దినపత్రిక

జేఏసీ నాయకులను కలిసిన వక్ఫ్ భూముల బాధితులు

మేడిపల్లి, నమస్తే ఎల్లంపల్లి: బోడుప్పల్ వర్క్ బాధితుల జేఏసీ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకుల సహకారంతో మధిర ఎమ్మెల్యే బట్టి విక్రమార్క ను కలిసి తమ సమస్య మీద అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగింది, ఆయన దానికి సానుకూలంగా స్పందించి మీ బోడుప్పల్ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు, అదేవిధంగా జేఏసీ చేయబోయే నిరసన కార్యక్రమాలకు మా తరఫున ఎల్లవేళలా మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ శ్రీధర్, బీజేపీ కార్పొరేటర్ కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్లు నర్సింహ రెడ్డి, కొత్త కిషోర్ గౌడ్, బొమ్మక్ కళ్యాణ్, వజ్రేష్ యాదవ్, ప్రహ్లాద రెడ్డి, భావన, శ్రీలత, ప్రవీణ్ రెడ్డి, మురళి, చక్రవర్తి ,భాస్కర్ రెడ్డి, పావని, ఉమ, సత్య శీలా రెడ్డి, బాలాజీ నగర్, ఇతర కాలనీలో పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading