- జూనియర్ సివిల్ జడ్జి కమలాపురం కవిత
అలంపూర్, ఫిబ్రవరి 11(నమస్తే ఎల్లంపల్లి): న్యాయస్థానాలు నిర్వహించే లోక్ అదాలత్ ద్వారా వివాదాలను పరిష్కరించుకోవచ్చునని జూనియర్ సివిల్ జడ్జి కమలాపురం కవిత అన్నారు. శనివారం అలంపూర్ జూనియర్ సివిల్ కోర్టు నందు లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసులను సత్వరమే పరిష్కరించి బాధితుల మధ్య రాజీ కుదిర్చేందుకు కోర్టులు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాయని, లోక్ అదాలత్ ద్వారా బాధితుల పరస్పర అంగీకారంతో కేసులను పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. ఈ లోక్ అదాలత్ ద్వారా 93 వివాదాలు పరిష్కారం అయ్యాయని తెలిపారు. బాధితుల పరస్పర రాజీ వల్ల 24 కేసులు పరిష్కారం అయ్యాయని, అపరాధ రుసుము ద్వారా 67 కేసులు, రెండు సివిల్ వివాదాలు పరిష్కారమయ్యావని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా అపరదరసము 1 లక్ష 52 వేల ఒక వంద రూపాయలు వచ్చాయని లోక్ అదాలత్ ఇంచార్జి సాయి తేజ తెలిపారు. ఈ కార్యక్రమంలో పీపీ కార్తీక్ ఉన్నారు.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.