* రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కె.యం. ప్రతాప్
కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: చింతల్ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో స్ట్రీట్ నెంబర్ 9 లో మంచినీటి సరఫరా సరిగ్గా లేక నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నామని మా యొక్క మంచి నీటి సమస్యను పరిష్కరించమని, రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కె.యం. ప్రతాప్ ను బస్తివాసులు కోరగా… కేఎం ప్రతాప్ వెంటనే స్పందించి HMWS -SB జనరల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి కి స్ట్రీట్ నెంబర్ 9 వాసులు ఎదుర్కొంటున్న మంచినీటి ఇక్కట్లను వివరించి, కొత్త మంచినీటి పైప్ లైన్ ను ఏర్పాటు చేయమని కోరారు. HMWS SB జనరల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ప్రతాప్ అభ్యర్థన మేరకు స్ట్రీట్ నెంబర్ 9 లో కొత్త మంచినీటి పైప్ లైన్ ను వేయించారు. ఈ సందర్భంగా స్వీట్ నెంబర్ 9, వాసులు కృతజ్ఞతతో కె.ఎం. ప్రతాప్ ను శాలువా, బొకేతో సత్కరించారు. HMWS SB జనరల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ జనరల్ మేనేజర్ లకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో యువ నేస్తం ఫౌండేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు కె.పి. విశాల్ గౌడ్, భగత్ సింగ్ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లా బకాష్, నరసింహ, భూమయ్య, రాములు, వెంకటస్వామి, రామకృష్ణ, జాన్సన్, స్వీట్ నెంబర్ 9 వాసులు పాల్గొన్నారు.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.