నవతరం

తెలుగు దినపత్రిక

ఛలో తిరుపతి ని విజయవంతం చేయండి

* ఓ.బి.సి ఆధ్వర్యంలో ఆగస్టు 7న ఛలో తిరుపతి మహాసభ

మెదక్ జిల్లా బ్యూరో, ఆగష్టు 2 (నమస్తే ఎల్లంపల్లి): అగస్టు ఏడున తిరుపతి లో జరిగే అఖిలభారత జాతీయ ఓ.బి.సి 8వ మహా సభను విజయవంతం చేయాలని వాల్ పోస్టర్లు విడుదల చేసిన అనంతరం మెదక్ జిల్లా బి.సి సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చిన్నింగ్ మల్లిఖార్జున్ గౌడ్, ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ కుమార్, జిల్లా కార్యదర్శి పిట్ల సాయిబాబా లు మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని కోరారు. అందుకే ‘బిసి జండా పట్టు.. ఆగస్టు 7న తిరుపతి బాట పట్టు’ అని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా బిసి ఉద్యమం ద్వార రాజకీయ నిర్మాణం చేపట్టడానికి జాతీయ మహా సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యా, ఉద్యోగాల్లో బిసిలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎవరికి లేని క్రిమిలేయర్ తెలంగాణ లో కేవలం బిసిలకే నిబంధనలు పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. మండల్ సిఫార్సు అమలు జరిగే వరకు ఉద్యమం ఉవ్వెత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు. మల్లిఖార్జున్ గౌడ్, బాయికాడి అంజి, గడ్డం ప్రశాంత్ కుమార్, పిట్ల సాయిబాబా లు సహచర బిసి ఉద్యమ నేతలతో కలిసి వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గడ్డం వెంకట్, గూడూరు కృష్ణా గౌడ్, ఆర్.వెంకటేశ్వర్లు గౌడ్, తుమ్మెట శ్రీనివాస్ యాదవ్, కుమ్మరి చెలిమేల రామస్వామి, కే. వేణుగోపాల్, జానకిరామ్ లు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading