నవతరం

తెలుగు దినపత్రిక

గ్రేహౌండ్స్ త్యాగాలు మరువలేనివి

– సమాజ హితం కోసం గ్రేహౌండ్స్ త్యాగాలు మరువలేనివి : గ్రేహౌండ్స్ & ఆక్టోపస్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్, ఐపీఎస్
– వాగ్దేవి స్కూల్ తరగతి గదులను ప్రారంభించిన గ్రేహౌండ్స్ & ఆక్టోపస్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్, ఐపీఎస్., మరియు సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్
– ఆర్క్ ఫౌండేషన్ సౌజన్యంతో..

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని తెలంగాణ గ్రేహౌండ్స్ లో ఉన్న వాగ్దేవి స్కూల్ లోని నూతన తరగతి గదులను ఈరోజు గ్రేహౌండ్స్ అండ్ ఆక్టోపస్ అడిషనల్ డీజీపీ (ఆపరేషన్స్) శ్రీ విజయ్ కుమార్, ఐపీఎస్., సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., ARK – SPHS 88 foundation సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రేహౌండ్స్ & ఆక్టోపస్ అడిషనల్ డీజీపీ (ఆపరేషన్స్) విజయ్ కుమార్, ఐపీఎస్., మాట్లాడుతూ.. సమాజం కోసం, సమాజ హితం కోసం గ్రేహౌండ్స్ త్యాగాలు మరువలేనివన్నారు. సమాజం కోసం గ్రేహౌండ్ స్ పోలీసు సిబ్బంది చేస్తున్న త్యాగాలను కొనియాడారు. గ్రేహౌండ్స్ సిబ్బంది వారి విధుల్లో భాగంగా అనేక రోజులు పాటు అడవుల్లో ఉంటూ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ అనేక సవాళ్లతో విధులు నిర్వర్తిస్తారన్నారు. గ్రేహౌండ్ సిబ్బంది కుటుంబ సభ్యుల సంక్షేమానికి ఎంత చేసినా తక్కువేనన్నారు. వ్యాస్ నగర్ గ్రేహౌండ్స్ లో ప్రస్తుతం కొనసాగుతున్న వాగ్దేవి ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు తరగతి గదుల కొరత ఉందని.. అడిగిన వెంటనే నూతన తరగతి నిర్మించేందుకు ముందుకు వచ్చిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., ARK – SPHS 88 Foundation సిబ్బంది అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ.. సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తైన తర్వాత మొదటగా గ్రేహౌండ్స్ పోస్టింగ్ కి వస్తారన్నారు. తాను గ్రేహౌండ్స్ కు వచ్చిన ప్రతిసారి సొంత ఇంటికి వచ్చినట్టు ఉంటుందన్నారు. ఎన్‌ఎస్ భాటీ, ఐపీఎస్ సాన్నిహిత్యంలో తాము ట్రైనింగ్ లో ట్యాక్టిక్స్ నేర్చుకుని ఫీల్డ్ లో అనేక విజయాలను సాధించామన్నారు. హైదర్ గూడ లోని సెయింట్ పాల్స్ స్కూల్ లో 88 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు కలిసి ARK-SPHS 88 Foundation (Act of Random Kindness – St. Pauls High School 88 Batch) ఏర్పాటుచేసి సమాజానికి తమ వంతు సాయం అందిస్తున్నారన్నారు. ఇలాంటి ARK-SPHS 88 ఫౌండేషన్ లో తాను సభ్యుడుగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. గతంలో 2004 వ సంవత్సరం జూన్ 21వ తేదీన అనురాగ్ శర్మ, ఐపీఎస్., ఐజిపి గ్రేహౌండ్స్ వారిచే వ్యాస్ నగర్ లోని తెలంగాణ గ్రేహౌండ్స్ లో వాగ్దేవి స్కూలు ప్రారంభించారన్నారు. అనంతరం.. తిరిగి గోవింద్ సింగ్, ఐపీఎస్., అడిషనల్ డీజీపీ ఆపరేషన్స్ తెలంగాణ వారిచే.. ఎన్ఎస్ భాటి సారథ్యంలో, తాను గ్రేహౌండ్స్ DIG గా ఉన్న సమయంలో 2015 వ సంవత్సరం జూన్ 11న వ్యాస్ నగర్ లోని తెలంగాణ గ్రేహౌండ్స్ లో సిబ్బంది పిల్లల కోసం వాగ్దేవి ప్రే ప్రైమరీ స్కూల్ నూతన తరగతి గదులను ప్రారంభించారన్నారు. పోస్ట్ కోవిడ్ తర్వాత… 2022 వ సంవత్సరంలో మొత్తం 320 మంది విద్యార్థులతో, ఒక్కో క్లాసులో, 40 మంది విద్యార్థులతో 8 తరగతి గదులు ఉండేవన్నారు. పెరిగిన విద్యార్థుల సంఖ్య మేరకు ప్రస్తుతం విద్యార్థుల సౌకర్యార్థం మరో నాలుగు కొత్త తరగతి గదులను LKG A, LKG B, 1 A, 1B నిర్మించామన్నారు. వాగ్దేవి స్కూల్ విద్యార్థుల సంక్షేమానికి నాలుగు తరగతి గదులను నిర్మించిన ఆర్క్ ఫౌండేషన్ ను అభినందిస్తున్నామన్నారు. తరగతి గదుల్లో ఎండవేడిమి తగలకుండా ఇన్సులేటింగ్ మెటీరియల్ ను ఫిట్ చేసిన రాజేష్ కార్పొరేషన్ ప్రొప్రైటర్ రాజేష్ కుమార్ అగర్వాల్, అతను కుమారుడు గౌరవ్ అగర్వాల్ ను సిపి అభినందించి సత్కరించారు. గ్రేహౌండ్స్ సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఆర్క్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్క్ ఫౌండేషన్ వారు విద్య, వైద్యం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని అభినందించారు. ఆర్క్ ఫౌండేషన్ సౌజన్యంతో వాగ్దేవి స్కూల్ విద్యార్థుల మెరుగైన భవిష్యత్తు కోసం నాలుగు నూతన తరగతి గదులను నిర్మించడం సంతోషకరమన్నారు. అనంతరం డాక్టర్ కేపీ శ్రీనివాస్, ఆర్క్ ఫౌండేషన్ మెంబర్ మాట్లాడుతూ.. సమాజ హితం కోసం గ్రేహౌండ్స్ నిస్వార్ధంగా, నిర్విరామంగా పనిచేస్తుందన్నారు. ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న గ్రే హౌండ్స్ సేవలకు అభినందనలు తెలిపారు. ఆర్క్ ఫౌండేషన్ ద్వారా తాము “గివ్ బ్యాక్ టు ద సొసైటీ” అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. అనంతరం గౌరవ అతిథులకు మెమొంటోలు, శాలువాలతో సత్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బి. రోహిత్ రాజు, ఐపీఎస్., గ్రూప్ కమాండర్ ఆపరేషన్స్ అండ్ ట్రైనింగ్., ఎం రమేష్, గ్రూప్ కమాండర్ (A &H), కొలోనియల్ సోమేశ్వర్ సింగ్, కన్సల్టెంట్., జి. దయానంద్, ఓఎస్డి ఆపరేషన్స్, బి వినాయక రావు, BAC (WEL)., ARK – SPHS 88 Foundation సభ్యులైన ప్రెసిడెంట్ ఇన్ రవీందర్ రెడ్డి, సెక్రటరీ డాక్టర్ సుధీర్ ప్రసాద్, ట్రెజరర్ ఆర్ రాజేష్ బోస్, రాజేష్ కార్పొరేషన్ ప్రోప్రైటర్ రాజేష్ కుమార్ అగర్వాల్, గౌరవ్ అగర్వాల్, వాగ్దేవి స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading