బొల్లారం మున్సిపల్ చర్చి బస్తి కి చెందిన యాదగిరి కుటుంబం పొట్టకూటి కోసం మహారాష్ట్ర నుంచి వచ్చి జీవిస్తున్నారు. యాదగిరి గత 10 సంవత్సరాలుగా ఆటో నడుపుతున్నాడు. యాదగిరి భార్య సత్యభామ ఆమె ఓ ప్రైవేటు స్కూల్లో ఆయాగా పనిచేస్తుంది. యాదగిరి నిన్న అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు పని చేస్తే గాని పూట గడవని పరిస్థితి వారిది. కాలనీవాసులు కేజెఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ని కలిసి ఆటో కార్మికుడు చనిపోయాడు సార్ కాబట్టి సహాయం చేయమని కోరగా ఆనంద్ కృష్ణారెడ్డి వెళ్లి అతని మృత దేహాన్ని చూసి ఆ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ ముగ్గురు పిల్లలు చూసి చలించి ఆ కుటుంబానికి అంత్యక్రియల కోసం, అలాగే మీ పిల్లలు చదువుకున్నప్పుడు ఏదైనా సాయం చేస్తా అని చెప్పడం జరిగింది. తనవంతుగా పదివేల రూపాయలు సహాయం చేయడం జరిగింది. కాలనీవాసులు ఆనంద్ కృష్ణారెడ్డి తో మాట్లాడుతూ చెప్పగానే వచ్చి మీరు పేద కుటుంబాన్ని ఆదుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు. ఆనంద్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఒక మనిషి కష్టాలు ఉన్నప్పుడు ఇంకో మనిషి ఆదుకోవాలని మా నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు అలాగే ఆటో సోదరులందరికీ నాకు విన్నపం దయచేసి మీ ఆటోలకు ఇన్సూరెన్స్ ఉండాలి, మీకు ఇన్సూరెన్స్ ఉండాలని మీ అందరిని కోరుకుంటున్నాను అన్నారు. చనిపోయిన తర్వాత భార్య పిల్లలు అనాధలుగా కాకుండా ఉండేందుకు ఇన్సూరెన్స్ చేసుకొని కుటుంబానికి మేలు జరిగేలా చూడాలని అందరిని చేతులు జోడించి అభ్యర్ధిస్తున్నట్లు చెప్పారు.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.