Awareness: టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న ఈ కాలంలో — ఎవరి ముఖం, ఎవరి గొంతు అయినా నకిలీగా సృష్టించగలుగుతున్న డీప్ ఫేక్ ప్రమాదకరంగా మారుతోంది.
సైబర్ నేరగాళ్లు తెలిసిన వ్యక్తిలా నటిస్తూ.. మన ఫోటో, వీడియో, గొంతు వాడి ఆపదలో ఉన్నామని డబ్బులు అడుగుతున్నారు. వ్యక్తిగత సమాచారం సేకరిస్తూ మోసాలు చేస్తున్నారు.
ఈ డీప్ ఫేక్ మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే ఒక సేఫ్ వర్డ్(సీక్రెట్ కోడ్) ఉపయోగించడం ఉత్తమమైన మార్గం.
ఎవరో మీకు కాల్ చేసిన లేదా వీడియోలో మాట్లాడుతూ.. డబ్బులు అడిగితే వారిని సేఫ్ వర్డ్ అడగండి.
తెలియని నంబర్ నుంచి డబ్బు అడిగినా, లింక్ షేర్ చేసినా — వెంటనే నమ్మవద్దు. రూపం, స్వరం నమ్మి మోసపోవద్దు.
ఇలాంటి కాల్స్ మీకు వస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి.
- VC Sajjanar, IPS




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.