* గాజులరామారంలో పద్మశాలి వనభోజన మహోత్సవం సందడిగా జరిగింది
* కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ
గాజులరామారం: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్‌లో పద్మశాలి కార్తీకమాస వనభోజన మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూరారం కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ హాజరయ్యారు. ఆయనకు నిర్వాహకులు శాలువా కప్పి జ్ఞాపికను అందజేస్తూ సాదర స్వాగతం పలికారు. వనభోజనాల్లో 300 మందికి పైగా పద్మశాలి బాంధవులు పాల్గొని ఉత్సాహంగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పాల్గొన్న అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
పద్మశాలీల ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం: మంత్రి సత్యనారాయణ
ఈ సందర్భంగా మంత్రి సత్యనారాయణ మాట్లాడుతూ, పూర్వీకులు సామాజిక ఐక్యతకు ప్రతీకగా వనభోజనాల వంటి సంప్రదాయాలను నెలకొల్పారని పేర్కొన్నారు. వనభోజనాలు ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని పెంపొందించడమే కాక, కుటుంబ బంధాలను బలపరుస్తాయని తెలిపారు. సామాజిక సౌభ్రాతృత్వం పెరగాలంటే “ఒకరి కోసం అందరూ – అందరి కోసం ఒకరూ” అనే భావన అవసరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుంటుక రూప, పట్టణ మహిళా అధ్యక్షురాలు పరండ్ల శారదా, యూత్ రాష్ట్ర అధ్యక్షుడు గుండేటి శ్రీధర్, నాయకులు సాయినాథ్ నేత, కస్తూరి బాలరాజు, తెలంగాణ సాయి, జర్నలిస్టులు ఈనాడు శ్రీనివాస్, టి. రమేష్, బూరెలా ముకేశ్, దూలప్ప, శ్రీదేవి నాగభూషణం, పాండు, జి. రాజశేఖర్, టాక్స్ శ్రీనివాస్, గోసిక్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.