నవతరం

తెలుగు దినపత్రిక

కొత్త అల్లిగూడెంలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

* ఎంపీ లాండ్స్ నిధులతో 65 మీటర్ల మేర నాలుగు లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు ఆరంభం

నవతరం ప్రతినిధి, ఖమ్మం భద్రాద్రి జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, పాత అల్లిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్త అల్లిగూడెం గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. గ్రామంలోని ఎంపీ ల్యాండ్స్ నిధుల నుంచి కేటాయించిన 4 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం అధికారికంగా ప్రారంభించారు. నారం చిన్నసోమరాజు ఇల్లు నుండి నారం పెద్దసోమరాజు ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మాణం.
నిర్మాణ నిడివి: సుమారు 65 మీటర్ల మేర ఈ రోడ్డును నిర్మించనున్నారు.

నిధులు: 4,00,000/- రూపాయలు.
ఈ కార్యక్రమం సర్పంచ్ కుంజా శ్రీను ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని, ప్రజల రవాణా ఇబ్బందులను తొలగించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నాణ్యతతో కూడిన పనులను గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ కెరం మంగ, మరియు వార్డు సభ్యులు కొర్సా లక్ష్మి, నారం కనక, నారం సుధాకర్, నారం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తమ వీధిలో రోడ్డు నిర్మిస్తున్నందుకు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading