నవతరం

తెలుగు దినపత్రిక

జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తాం

* అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందేలా ప్రత్యేక చర్యలు

* మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

కూకట్పల్లి, నమస్తే ఎల్లంపల్లి: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం పాత్రికేయుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ వస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. సోమవారం కూకట్పల్లి లోని చిత్తారమ్మ దేవాలయం ప్రాంగణంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (143) కూకట్పల్లి నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా అల్లం నారాయణతో పాటు టియుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తూ వస్తుందని తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నియోజకవర్గాల వారీగా జర్నలిస్టులకు స్థానిక ఎమ్మెల్యేలు ఇళ్ల స్థలాలు అందిస్తూ వస్తున్నారని చెప్పారు. కూకట్పల్లి, శేర్లింగంపల్లి నియోజకవర్గాలలో పనిచేసే అర్హులైన జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని చెప్పారు. అనంతరం ఆస్కానీ మారుతి సాగర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి నుండి మొదలుకొని మండల స్థాయి వరకు పనిచేస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్టుకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లతోపాటు ప్రభుత్వ పథకాలు అందేలా యూనియన్ కృషి చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా కూకట్పల్లి కమిటీ నూతన అధ్యక్షులు మహేందర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, కోశాధికారి భాస్కర్ చారిలకు నియామక పత్రాలను అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు విద్యా వెంకట్, ఆర్కే దయాసాగర్, నిమ్మల శ్రీనివాస్, మల్లేశం, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గంధం రాములు, దరువు అంజన్న, పి వి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading