• ప్రభుత్వ భూములు అమ్మి సొమ్ము చేసుకుంటున్న కబ్జాదారుడు సాయి
• గంజాయి బ్యాచ్ ను కాపలాగా పెట్టుకున్న క ‘సాయి’
• రెవెన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే అక్రమ నిర్మాణాలు
• నీకింత, నాకింత అంటూ పంచుకుతింటున్న అవినీతి అధికారులు, కబ్జాదారులు
• కవరేజీకి వెళ్లిన విలేకరులపై భౌతిక దాడులకు పాల్పడ్డ క ‘సాయి’ అనుచరులు
• కేసులు నమోదైనా తీరు మార్చుకొని భూకబ్జాదారుడు
• ఇరవైకి పైగా అక్రమ నిర్మాణాలు చేసినా కనిపించడం లేదా…?
• ఇకనైనా చర్యలు తీసుకుంటారా లేక అవినీతిని ఒప్పుకుంటారా…?





మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని గాజులరామారం, దేవేందర్ నగర్ లోని సర్వే నంబర్ 329/1 లోని ప్రభుత్వ భూముల్లో పాగా వేసిన కబ్జాదారుడు సాయిరాజు ఇప్పటికే ఒక ఎకరం ప్రభుత్వ భూమిని ఆక్రమించి అందులో 60, 80 గజాల ప్లాట్లు చేసి సుమారు మూడు కోట్ల రూపాయలు దండుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ కబ్జాదారుడు తనకు తోడుగా ఓ గంజాయి బ్యాచ్ ను వేసుకుని, వార్తలు రాసిన విలేకరులపై దాడులకు పాల్పడుతూ, ఓ పోలీసు అధికారి అండదండలతో బరితెగించి రెచ్చిపోతూ…. స్థానిక రెవెన్యూ అధికారులకు సవాల్ గా మారాడు. ఇంత జరుగుతున్నా కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు. సాయి రాజు విసిరే బిస్కెట్ లు ఎవరెవరు తిన్నారు, బరితెగించిన కబ్జాదారుడు సాయిరాజు ప్రస్తుత స్టేటస్ ఏంటి… బెంజి కారులో షికార్లు కొడుతూ విలాసవంతమైన జీవితం ఎలా గడుపుతున్నాడు… ఇప్పటికి ఎన్ని అక్రమ నిర్మాణాలు చేశాడు… అనే విషయాలతో ‘నమస్తే ఎల్లంపల్లి’ ప్రత్యేక కథనం…

క్రైం ప్రతినిధి, నమస్తే ఎల్లంపల్లి: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని ప్రభుత్వ భూములు పట్టపగలే మాయమౌతున్నా తమకేమీ పట్టనట్టుగా వ్యవహారిస్తున్నారు స్థానిక రెవిన్యూ అధికారులు. గత సంవత్సరం ఆగష్టు లో తన కబ్జా తతంగానికి తెరలేపిన భూకబ్జాదారుడు సాయి ఇప్పటికే ముప్పైకి పైగా అక్రమ నిర్మాణాలు ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ప్రభుత్వ భూమిలో ప్లాట్ లు అమ్మి సొమ్ము చేసుకున్న సాయి తన విలాస జీవితంలో భాగంగా ఓ బెంజి కారును కొనుక్కుని అందులో షికార్లు చేస్తున్నాడు. ఇదంతా కూడా ఎక్కడో మారు మూల ప్రాంతంలో కాదు. కుత్బుల్లాపూర్ రెవిన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న దేవేందర్ నగర్ సర్వే నంబర్ 329/1 లోనే… పూర్తి వివరాల్లోకి వెళితే… తానొక ఆవారా… రోడ్డుపై తిరిగే రౌడీ ఫెల్లో… పోలీస్ ఇన్ఫోర్మర్ నని చెప్పుకుని పబ్బం గడుపుకునే వెధవ…. వీటన్నింటికంటే కొందరు దొంగలతో దోస్తానా… ఇదే ఖచ్చితమైన నిజం అని నిరూపించే ప్రభుత్వ భూముల్లోని భూకబ్జాలు. ఇదంతా కూడా సరిగ్గా సరిపోయే క్యారెక్టర్ ఉన్న కబ్జాదారుడు సాయిరాజు భాగోతం. ఈ ఊరూ పేరూ లేని ఎదవ భూకబ్జాలకు తెరలేపి సరిగ్గా నేటికి ఎనిమిది నెలల సమయం అవుతుంది. దేవేందర్ నగర్ లోని ప్రభుత్వ భూముల్లో ఎనిమిది నెలల్లోనే సుమారు ముప్పై ఇండ్ల నిర్మాణం చేసినా తమకేమీ తెలియదన్నట్టు వ్యవహరిస్తున్న కుత్బుల్లాపూర్ రెవిన్యూ అధికారుల అవినీతి భాగోతం ఇట్టే అర్థమౌతుంది. కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని కొన్ని వందల ఎకరాల్లో విస్తరించి వున్న ప్రభుత్వ భూముల్లో ఎవడో ఒక ఎదవ, ఎదో ఒక సందర్భాన్ని ఆసరాగా చేసుకుని కబలిస్తూ అందులో తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇదే తరహాలో ఊరూ పేరూ లేని, ఎవడికీ తెలియని ఓ పిల్ల కుంక గత ఎనిమిది నెలల క్రితం ఇక్కడి ప్రభుత్వ భూమిలో పాగా వేశాడు. గత సంవత్సరం దేవేందర్ నగర్ లోని రాధాకృష్ణ మందిరం వెనుకాల సర్వే నంబర్ 329/1 లోని ప్రభుత్వ భూమిలోఒక అక్రమ నిర్మాణాన్ని ఏర్పాటు చేశాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న కొందరు విలేకరులు ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాల ఫోటోలు తీసుకుని అక్కడ నుండి వెళుతున్న సమయంలో అక్కడే మద్యం, గంజాయి మత్తులో ఉన్న కబ్జాదారుడు సాయి అనుచరులు సుమారు పన్నెండు మంది ఒక్కసారిగా ఇద్దరు విలేకరులపై దాడికి పాల్పడి రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా వారు దాడి చేస్తున్న ఘటనను వారే వారి సెల్ ఫోన్ లలో చిట్రీకరించుకుని నానా బూతులు తిడుతూ, ఒక రకమైన హంగామా సృష్టించారు. అంతే కాకుండా ఓ విలేకరి వద్ద అతడి చరవాణి దొంగిలించి అక్కడ నుండి వెళ్లిపోయారు. ఇక్కడ జరిగిన తతంగమంతా స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి వెనకుండి నడిపించినట్టు విశ్వసనీయ సమాచారం. తరువాతి రోజు జర్నలిస్టు నాయకుల చొరవతో జీడిమెట్ల పోలీసుల్ స్టేషన్ లో బాధిత జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన జీడిమెట్ల పోలీసు స్టేషన్ హౌస్ అధికారి నామమాత్రపు సెక్షన్ లతో కేసు నమోదు చేసి కబ్జాదారులకు ఊరటనిచ్చాడు. అనంతరం జర్నలిస్టు సంఘాల నాయకులు, తోటి జర్నలిస్టులతో కలిసి సూరారంలోని కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారికి భూకబ్జాదారుడైన సాయిరాజు పై చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలని వినతిపత్రం అందజేశారు. ఇదంతా కూడా ఒక నాలుగు రోజుల కథ.

ఆ తర్వాత కబ్జాకు పాల్పడిన సాయిరాజు ఓ పోలీసు అధికారి సహాయంతో దాడి జరిగిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరిని మచ్చిక చేసుకుని, పరోక్షంగా భయాందోళనకు గురి చేసి కేసు కాంప్రమైస్ చేసుకున్నట్టు విశ్వాసనీయ సమాచారం. దీంతో అంతా అయిపోయిందనుకున్న సదరు క ‘సాయి’ అంతటితో ఆగకుండా సుమారు ఒక ఎకరా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, ఫోర్జరీ సంతకాలతో ప్లాట్ లు అమ్ముకుని సొమ్ము చేసుకున్నాడని తెలుస్తుంది. ఒక ఎకరా ప్రభుత్వ భూమిలో సుమారు ముప్పై ఇండ్లను నిర్మించి ఒక్కో ప్లాట్ ను పడి లక్షల నుండి పదిహేను లక్షల రూపాయలకు అమ్మి తన విలాసవంతమైన జీవితానికి పునాదులు వేసుకున్నాడు. అంతేకాకుండా, తానొక పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పుకుంటూ చంద్రగిరి నగర్ లో చిన్నపాటి కార్యాలయాన్ని ఓపెన్ చేసి అందులో చోటా మోటా వ్యవహారాల్లో కలుగజేసుకుని అందులోనూ కొన్ని డబ్బులు దండుకున్నాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి, జర్నలిస్టులపై భౌతిక దాడులకు పాల్పడి, లక్షలు దండుకుంటున్న భూకబ్జాదారుడు క ‘సాయి’ పై పీడీ యాక్టు నమోదు చెయ్యాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వ భూములను కాపాడి భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.